-
-
Home » Mukhyaamshalu » latest viral trending and Breaking ABN Andhra Jyothy news across globe 12Th oct 2025 kjr
-
BREAKING: నకిలీ మద్యం కేసులో సిట్ ఏర్పాటుచేసిన ఏపీ ప్రభుత్వం
ABN , First Publish Date - Oct 12 , 2025 | 06:29 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 12, 2025 19:42 IST
సిట్ ఏర్పాటు..
నకిలీ మద్యం కేసులో సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సిట్
సిట్ సభ్యులుగా రాహుల్‌దేవ్ శర్మ, మల్లికా గార్గ్
-
Oct 12, 2025 19:36 IST
వైసీపీ హయాంలో తమ సొంత బ్రాండ్లు తెచ్చారు: సీఎం చంద్రబాబు
మద్యం షాపుల్లో బ్రాండెడ్ లిక్కర్ లేకుండా చేశారు: చంద్రబాబు
డిస్టిలరీలను బలవంతంగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు: చంద్రబాబు
నేరాలు చేసేవారిని వదిలే ప్రసక్తేలేదు: సీఎం చంద్రబాబు
వైసీపీ పాలనలో ఎప్పుడూ చూడని నేరాలు చూశాం: చంద్రబాబు
మొత్తం ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు: చంద్రబాబు
మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం విధానం అమలు చేస్తున్నాం
ములకలచెరువు ఘటనలో ప్రధాన నిందితుడు అరెస్ట్: సీఎం చంద్రబాబు
23 మంది నిందితులను గుర్తించి.. 16 మందిని అరెస్ట్ చేశాం: చంద్రబాబు
నేరం చేసినవారు ఎవరైనా వదిలిపెట్టవద్దని అధికారులను ఆదేశించాం: చంద్రబాబు
నేరాలు చేసేవారిలో మా పార్టీ వారున్నా వెనకాముందు చూడలేదు: చంద్రబాబు
నకిలీ మద్యంపై సిట్ వేసి మొత్తం ప్రక్షాళన చేస్తాం: సీఎంచంద్రబాబు
నకిలీ మద్యం కేసులో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి: చంద్రబాబు
-
Oct 12, 2025 18:34 IST
బిహార్‌లో కొలిక్కివచ్చిన NDA సీట్ల సర్దుబాటు
JDUకి 101, BJPకి 101, LJP(R)కి 29 సీట్లు
RLMకి 6, HAMకి 6 సీట్లు కేటాయింపు
-
Oct 12, 2025 17:14 IST
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
లాడీల్ నుంచి తరలిస్తున్న ఉక్కు ద్రావణం నేలపాలు
భారీగా ఆస్తి నష్టం, తప్పిన ప్రమాదం
-
Oct 12, 2025 15:58 IST
ఉమ్మడి వరంగల్ పంచాయితీలో కీలక మలుపు
ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటిపై ఇద్దరు మహిళా మంత్రుల ఫిర్యాదు
పొంగులేటిపై PCCకి ఫిర్యాదు చేసిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
పొంగులేటిపై సీతక్క, కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టు తెలిపిన మహేష్ గౌడ్
తమ ఇంటి సమస్యను పరిష్కరించుకుంటామన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
-
Oct 12, 2025 15:48 IST
నిజామాబాద్: సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారు: మంత్రి వివేక్
కులం ఆధారంగా కుట్రలు, విమర్శలు చేస్తున్నారు: మంత్రి వివేక్
మంత్రి లక్ష్మణ్‌ని రెచ్చగొట్టి విమర్శలు చేయించారు: మంత్రి వివేక్
జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలిస్తే నాకు మంచిపేరు వస్తుందనే విమర్శలు
లక్ష్మణ్ వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అనటం సరికాదు
మాల కాబట్టే మంత్రి లక్ష్మణ్ నాపై విమర్శలు: మంత్రి వివేక్
-
Oct 12, 2025 15:47 IST
విశాఖ: ACA-VCDA స్టేడియంలో మంత్రి లోకేష్
మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికిన ACA ప్రెసిడెంట్ కేశినేని చిన్ని
A గ్యాలరీ స్టాండ్‌కు మిథాలీరాజ్, మూడో గేట్‌కు రావి కల్పన పేరుతో ఆవిష్కరణ
హాజరైన మంత్రి లోకేష్, ICC చైర్మన్ జైషా, BCCI ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్
-
Oct 12, 2025 13:47 IST
గుంటూరులో పరువు హత్య
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పరువు హత్య..
దుగ్గిరాల మండలం చిలుమూరులో.. వేరే మతం యువకుడిని ప్రేమించిన యువతి..
కులాంతర వివాహం ఇష్టం లేక వేరే యువకుడితో పెళ్లికి ఏర్పాట్లు..
ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయేందుకు సిద్దమైన యువతి..
యువతికి కూల్ డ్రింక్‌లో విషం కలిపి తాగించిన కుటుంబ సభ్యులు, ఆత్మహత్యగా చిత్రీకరణ.
గుంటూరు జీజీహెచ్ మార్చురీలో మృతదేహం
-
Oct 12, 2025 12:43 IST
బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి ఖైదీ ఆత్మహత్యాయత్నం
జనగామ సబ్ జైల్లో బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి ఖైదీ ఆత్మహత్యాయత్నం
చికిత్స పొందుతూ ఎంజీఎంలో మృతి..
మృతుడు దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన మల్లయ్యగా గుర్తింపు
సబ్ జైలు ముందు బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆందోళన
సబ్ జైలు అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్
-
Oct 12, 2025 10:42 IST
వనస్థలిపురంలో కారు బీభత్సం..
వనస్థలిపురం సమీపంలోని గుర్రంగూడలో కారు బీభత్సం..
మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు..
థార్ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీకొట్టిన యువకులు..
డివైడర్ దాటి మరో కారును ఢీకొట్టి బోల్తా పడిన థార్..
ఐదుగురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు..
-
Oct 12, 2025 09:28 IST
పల్నాడులో.. మెలియాయిడోసిస్ కేసు
పల్నాడులో బయటపడిన మెలియాయిడోసిస్ కేసు
వెల్దుర్తి మండలం దావుపల్లితండాలో జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు.
పరీక్షల్లో బయటపడిన మెలియాయిడోసిస్
రోగిని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు..
గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టిన సిబ్బంది, పర్యవేక్షించిన జిల్లా వైద్యాధికారి రవి..
మెలియాయిడోసిస్ అంటు వ్యాధి కాదు..
గ్రామస్థులు భయపడవద్దన్న వైద్యాధికారి
బురద, మట్టిలో బ్యాక్టీరియా ఉంటుందన్న వైద్యాధికారి
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.
ఇప్పటికే గుంటూరు జిల్లా తురకపాలెంను వణికించిన మెలియాయిడోసిస్ కేసుల భయం
-
Oct 12, 2025 09:11 IST
ఆర్టీసీకి రూ.కోటికి పైగా ఆదాయం
విశాఖ: దసరా పండగ సందర్భంగా ఆర్టీసీకి కోటి రూపాయలకు పైగా ఆదాయం
ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా 1.05 కోట్లు ఆదాయాన్ని గడించిన ఆర్టీసీ
ఆర్టీసీ విశాఖ రీజియన్‌లో దసరా సమయంలో 650 ప్రత్యేక సర్వీసులు నడిపి.. 110% ఆక్యుపెన్సీ సాధింపు
సెప్టెంబర్ 27 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడిపిన ఆర్టీసీ
-
Oct 12, 2025 09:06 IST
హోటల్లో భారీ అగ్నిప్రమాదం
నెల్లూరు నగరంలోని బ్లూ మూన్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం
హుటిహుటీన అక్కడికి చేరుకున్న ఎస్పీ అజిత వెజెండ్ల.
ఎస్పీ సూచనలతో హోటల్‌లో ఉన్న 30 మందిని సురక్షితంగా కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.
షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు వెల్లడి.
-
Oct 12, 2025 07:35 IST
నేడు తుంగతుర్తికి సీఎం రేవంత్ రెడ్డి
సూర్యాపేట తుంగతుర్తిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు.
ప్రత్యేక చాపర్‌లో మధ్యాహ్నం 12:30 గంటలకు తుంగతుర్తికి సీఎం
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు పయనం
-
Oct 12, 2025 07:26 IST
నేటి నుంచి దర్శనాల నిలిపివేత
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి అలయంలో నేటి నుంచి దర్శనాల నిలిపివేత
భీమేశ్వర స్వామి అలయంలో భక్తుల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు
రాజన్న గుడి విస్తరణలో భాగంగా కొన్ని నెలలు దర్శనాలు నిలిపివేత