-
-
Home » Mukhyaamshalu » latest viral trending and Breaking ABN Andhra Jyothy news across globe 10Th oct 2025 kjr
-
BREAKING: ఏపీ నకిలీ మద్యం కేసులో జనార్దన్‌రావు అరెస్ట్
ABN , First Publish Date - Oct 10 , 2025 | 07:24 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 10, 2025 21:05 IST
నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఇథనాల్ ప్రాజెక్ట్, లైఫ్ స్కూల్, గోశాల ప్రారంభం
ఇథనాల్ పరిశ్రమతో రైతులకు మంచి జరుగుతుంది: చంద్రబాబు
గోశాలలో ఎద్దులతో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు: చంద్రబాబు
నందగోకులంలో పేద పిల్లలకు విద్య అందిస్తున్నారు
P4లో అందరూ భాగస్వాములు కావాలి: సీఎం చంద్రబాబు
నెల్లూరు జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం: చంద్రబాబు
త్వరలో రామాయపట్నం, దుగ్గరాజుపట్నం రాబోతోంది: చంద్రబాబు
2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెం.1గా అవుతుంది: చంద్రబాబు
దేశంలోనే ఏపీని నెంబర్ 1గా మారుస్తాం: సీఎం చంద్రబాబు
-
Oct 10, 2025 18:48 IST
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్
మైక్రోసాఫ్ట్‌తో పాటు ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌కూ సలహాదారుగా రిషి
రిషి సునక్ నియామకానికి షరతులతో యూఎస్ ప్రభుత్వం అనుమతి
ఇప్పటికే గోల్ట్‌మన్ శాక్స్‌లో సీనియర్ సలహాదారుగా ఉన్న రిషి సునక్
-
Oct 10, 2025 18:47 IST
ఏపీ నకిలీ మద్యం కేసులో జనార్దన్‌రావు అరెస్ట్
సౌతాఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్దన్‌రావు
గన్నవరం ఎయిర్‌పోర్టులో జనార్దన్‌రావు అరెస్ట్
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1గా జనార్దన్‌రావు
-
Oct 10, 2025 18:41 IST
ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉంది: సీఎం చంద్రబాబు
మన పిల్లలకు శిక్షణ ఇస్తే.. ప్రపంచాన్ని శాసిస్తారు: చంద్రబాబు
రామాయపట్నంలో త్వరలో బీపీసీఎల్ పెట్టుబడులు పెట్టబోతోంది
2047 నాటికి ప్రపంచదేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంటుంది
2047 నాటికి భారత్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉంటుంది: చంద్రబాబు
2047 నాటికి తెలుగుజాతి అగ్రస్థానంలో ఉంటుంది: చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాబోతుంది: చంద్రబాబు
మూడేళ్లలో రూ.88 వేల కోట్ల పెట్టుబడులు గూగుల్ పెట్టబోతుంది: చంద్రబాబు
-
Oct 10, 2025 18:41 IST
కృష్ణా: మచిలీపట్నం పోలీసులపై పేర్ని నాని తీవ్ర విమర్శలు
కొల్లు రవీంద్ర మజా కోసమే పోలీసులు పని చేస్తున్నారు: పేర్ని
అధికార పార్టీ నేతలకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
కొందరు పోలీస్ అధికారుల తీరు పట్ల కానిస్టేబుళ్లు నలిగిపోతున్నారు
వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం
41ఏ నోటీసులు ఇచ్చే క్రమంలో వైసీపీ కార్యకర్తలను.. భయపెడుతున్నారని ఆరోపించిన పేర్నినాని
పోలీసుల తప్పుడు కేసులను కోర్టుల్లో ఎదుర్కొంటాం: పేర్నినాని
-
Oct 10, 2025 18:41 IST
కర్నూలులో ప్రధాని మోదీ పర్యటనపై మంత్రుల బృందం సమీక్ష
ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రుల బృందం
ఈనెల 16న కర్నూలులో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై ప్రధాని సభ
ప్రధాని మోదీతో పాటు పాల్గొననున్న చంద్రబాబు, పవన్, లోకేష్
-
Oct 10, 2025 18:41 IST
పైడితల్లి అమ్మవారి పండుగను ఏ ఒక్కరిదో అన్నట్లు చేస్తున్నారు: బొత్స
ఆర్భాటం, అహంకారం తప్పా సంప్రదాయబద్ధంగా పండుగ జరగలేదు: ఎమ్మెల్సీ బొత్స
పండుగ జరపడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో హుండీలు పెట్టారు: ఎమ్మెల్సీ బొత్స
గతంలో ఎప్పుడూ లేని విధంగా బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు: ఎమ్మెల్సీ బొత్స
పూర్తి నిర్లక్యంగా వ్యవహరించారు: బొత్స సత్యనారాయణ
-
Oct 10, 2025 16:23 IST
మచిలీపట్నం పీఎస్‌లో సీఐతో పేర్నినాని ఘర్షణ
ఇటీవల పేర్నినాని నాయకత్వంలో మెడికల్ కాలేజీ దగ్గర నిరసన
అనుమతులు లేని నిరసనలో పాల్గొన్నారని పేర్నినానితో సహా..
400 మందికి 41ఎ నోటీసులు ఇచ్చిన పోలీసులు
పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వొద్దన్న వైసీపీ నేత సుబ్బన్న
కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడుతున్న పోలీసులు
కార్యకర్తలతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన పేర్ని నాని
ఆర్ పేట సీఐతో ఘర్షణకు దిగిన పేర్నినాని
పేర్ని నాని చర్యలతో విస్తుపోయిన పోలీసులు
స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని కోరిన పోలీసులు
-
Oct 10, 2025 14:45 IST
ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
గూగుల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్న చంద్రబాబు, లోకేష్
విశాఖలో గూగుల్ ఏర్పాటు చేసే డేటా సెంటర్‌కు సంబంధించి ఢిల్లీలో కీలక ప్రకటన
ఈ నెల 14న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లతో కలిసి..
కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో ఒప్పందం
విశాఖలో రూ.84వేల కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు
దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కలిసే అవకాశం
-
Oct 10, 2025 14:45 IST
గుంటూరు: అన్నపర్రు బీసీ హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై మంత్రి సవిత ఆరా
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశం
అన్నపర్రు బీసీ హాస్టల్ ఘటనపై దర్యాప్తునకు మంత్రి సవిత ఆదేశం
ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్యంపై నివేదికివ్వాలని మంత్రి ఆదేశం
-
Oct 10, 2025 14:45 IST
అమరావతి: మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మూత పడకుండా చేయగలిగాం: సీఎం చంద్రబాబు
స్టీల్ ప్లాంట్‌ను నష్టాల నుంచి బయటకు తీసుకురాగలిగాం: సీఎం చంద్రబాబు
విశాఖ రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు
ఆర్సెల్ మిట్టల్ ప్లాంట్‌కు త్వరలో శంకుస్థాపన: చంద్రబాబు
ఇవన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
విశాఖను ముంబైలా అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
-
Oct 10, 2025 14:45 IST
కరీంనగర్: బీసీల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: ఈటల
ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పరువు తీసుకుంది: ఎంపీ ఈటల
తెలంగాణ ప్రజలను రేవంత్‌రెడ్డి వంచించారు: ఈటల
హుజురాబాద్‌లో బీ ఫామ్స్ నేనే ఇస్తా: ఎంపీ ఈటల
నేను కాకుండా బీ ఫామ్స్ ఎవరిస్తారు?: ఎంపీ ఈటల
-
Oct 10, 2025 14:38 IST
వెనెజులా మహిళకు నోబెల్ శాంతి బహుమతి
మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు మరియాకు నోబెల్
వెనెజులా పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడో
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ ఆశలు గల్లంతు
నోబెల్ శాంతి బహుమతి ఆశించిన డొనాల్డ్ ట్రంప్
-
Oct 10, 2025 13:38 IST
అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..
నాకు అసంతృప్తి ఉంది.. ఏబీఎన్‌తో అంజన్ కుమార్ యాదవ్
నా బాధనంతా మీనాక్షీ నటరాజన్ కు చెప్పాను
కేంద్ర మంత్రిని కావలసిన వాడిని కాలేకపోయాను..
రాహుల్ ప్రధాని అయితే కేంద్ర మంత్రిని అవుతాను..
ఇప్పటికైనా మా సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వమని చెప్పాను..
దేవుడి దగ్గరికి వెళ్తే అందరికీ ఆశీస్సులు ఇస్తారు..
అవసరం ఉంటే జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తా: అంజన్ కుమార్ యాదవ్
-
Oct 10, 2025 12:05 IST
హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత
17 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు.
హస్టల్‌లో అందుబాటులో లేని వార్డెన్ .
విద్యార్థులను ఆసుపత్రికి తరలించిన వంటమనిషి.
-
Oct 10, 2025 10:46 IST
చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షాలు
ఉరుములు, మెరుపులు, పిడుగులు, శబ్దాలతో కూడిన వర్షం.
భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు.
కోతలకు గురైన రోడ్లు.. నీట మునిగిన వరి, కూరగాయ పంటలు.
అర్ధరాత్రి నుంచి 15 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
-
Oct 10, 2025 10:43 IST
రూ.కోటి విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం
రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ స్వాధీనం పట్టివేత
కోటి రూపాయలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేసిన మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు..
డ్రగ్స్ రాకెట్‌పై మధ్యాహ్నం మీడియాకు వివరాలు వెల్లడించనున్న రాచకొండ సీపీ సుధీర్ బాబు..
-
Oct 10, 2025 10:19 IST
రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
భేటీలో పాల్గొన్న మంత్రులు పయ్యావుల, దుర్గేష్, బాలవీరాంజనేయస్వామి
రుషికొండ ప్యాలెస్‌ను ప్రజా అవసరాల కోసం.. ఏవిధంగా వినియోగించుకోవాలనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ
పలువురి అభిప్రాయాలు సేకరించి తుదినిర్ణయం తీసుకోనున్న సబ్ కమిటీ
-
Oct 10, 2025 09:55 IST
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో హైడ్రా కూల్చివేతలు..
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఆక్రమణకు గురైన 5 ఎకరాల ప్రభుత్వ స్థలం..
సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా..
భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టిన హైడ్రా సిబ్బంది..
-
Oct 10, 2025 07:32 IST
భారీ వర్షాలు.. 5 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
నల్లగొండ అనుముల మండలం పేరూరు వద్ద వర్షానికి తెగిన బ్రిడ్జ్
చెరువు నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో నీటి తాకిడికి తెగిపోయిన సీసీ రోడ్.
5 గ్రామాల ప్రజలకు నిలిపోయిన రాకపోకలు
ఇబ్బంది పడుతున్న ప్రజలు.