-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy Breaking today latest viral trending National and International news across GLOBE 5th oct 2025 kjr
-
BREAKING: శ్రీశైలం బోర్డు సభ్యుల ఎంపిక వివాదం
ABN , First Publish Date - Oct 05 , 2025 | 07:24 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 05, 2025 20:23 IST
గుంటూరు: శ్రీశైలం బోర్డు సభ్యుల ఎంపిక వివాదం
దేవకి వెంకటేశ్వర్లుకు బోర్డు మెంబర్ పట్ల ఆర్యవైశ్యుల ఆగ్రహం
వైసీపీ నుంచి వచ్చిన వెంకటేశ్వర్లుకు పదవి ఎలా ఇస్తారని ప్రశ్న
పవన్ కల్యాణ్ పునరాలోచన చేయాలని ఆర్యవైశ్య సంఘాలు విజ్ఞప్తి
కూటమిలో ఉన్న ఆర్యవైశ్యులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
-
Oct 05, 2025 20:23 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై BRS ఫోకస్
వెంకటగిరి ప్రాంతంలో హరీష్‌రావు బైక్ ర్యాలీ
ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేసిన BRS
-
Oct 05, 2025 20:23 IST
చిత్తూరు: మొలకలచెరువు నకిలీ మద్యం కేసు దర్యాప్తు
నిందితుడు సురేంద్రనాయుడు బంధువు పొలంలో మద్యం డంప్ గుర్తింపు
పొలంలో నిల్వచేసిన మరో 4 మద్యం బాక్సులు స్వాధీనం
నిందితుడు సురేంద్రనాయుడుకు చెందిన ఆంధ్ర వైన్స్ సీజ్
నకిలీ మద్యం తయారీ కేసులో ఇప్పటికే 14 మందిపై కేసు నమోదు
-
Oct 05, 2025 16:05 IST
వలసదారులకు ట్రంప్ వన్‌టైమ్ స్టైఫండ్ ఆఫర్
14 ఏళ్లకంటే ఎక్కువ వయస్సున్న వలసదారుల పిల్లలు..
స్వచ్ఛందంగా అమెరికాను వీడితే 2,500 డాలర్లు: ట్రంప్
ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఇమిగ్రేషన్ లాయర్లు
-
Oct 05, 2025 11:16 IST
పాకిస్థాన్ ఆర్మీ సంచలన వ్యాఖ్యలు
భారత్‌తో యుద్ధంపై పాకిస్థాన్ ఆర్మీ సంచలన వ్యాఖ్యలు
భారత సైనికాధికారులు, రాజకీయ నేతలు వ్యాఖ్యలపై స్పందన
తమపై మరోసారి దాడి చేయడానికి భారత్ సాకులు సృష్టిస్తోందంటూ అక్కసు
మరో యుద్ధం వస్తే పెను విధ్వంసమే..
యుద్ధం వస్తే రెండు దేశాలు తుడిచిపెట్టుకుపోతాయి..
మరో యుద్ధం వస్తే మేం వెనక్కు తగ్గం..
ఎలాంటి సహనాన్ని ప్రదర్శించబోదు: పాక్ ఆర్మీ
-
Oct 05, 2025 11:09 IST
డార్జిలింగ్‌లో వర్ష బీభత్సం
వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి, మృతుల్లో చిన్నారులు
మిరిక్ దగ్గర విరిగిపడ్డ కొండచరియలు, కొనసాగుతున్న సహాయ చర్యలు
దూదియా దగ్గర బాలసోన్ నదిలో కుప్పకూలిన ఇనుప వంతెన
సిలిగురి-మిరిక్ మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు
డార్జిలింగ్ జిల్లా జస్బీర్‌బస్తీలో ఘటన
-
Oct 05, 2025 11:07 IST
పెద్దపులి కలకలం..
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గండిచెరువు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కలకలం.
ఉదయం పొలాలకు వెళ్తున్న రైతుల కంటపడ్డ పెద్దపులి.
పెద్ద పులి సంచారాన్ని సెల్ ఫోన్లో వీడియో తీసిన రైతులు.
పెద్దపులి సంచారంతో భయాందోళనలో గ్రామస్తులు.
గత కొద్ది రోజులుగా గండి చెరువు పరుస ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి.
-
Oct 05, 2025 10:08 IST
వైష్ణోదేవి యాత్రనిలిపివేత
జమ్మూకశ్మీర్: వైష్ణోదేవి యాత్ర 3 రోజులపాటు నిలిపివేత
ప్రతికూల వాతావరణంతో ఈ నెల 7వరకు యాత్ర నిలిపివేత
యాత్ర నిలిపివేస్తున్నట్లు వైష్ణోదేవి బోర్డు ట్వీట్
ఈ నెల 8న వైష్ణోదేవి యాత్ర తిరిగి ప్రారంభం
-
Oct 05, 2025 10:03 IST
గాజాలో యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన
బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్
గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించింది..
బలగాల ఉపసంహరణ సమాచారాన్ని హమాస్‌కు కూడా పంపించాం..
హమాస్ కూడా అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమలు..
బందీలు, ఖైదీల అప్పగింత ప్రారంభమవుతుంది..
ఆ తర్వాత బలగాలు ఉపసంహరణకు నిబంధనలు రూపొందిస్తాం: ట్రంప్
-
Oct 05, 2025 09:36 IST
అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
ఈ రోజు తెలంగాణ లోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
రేపు తెలంగాణలో అక్కడక్కడా మోస్తారు వర్షం కురిసే అవకాశం..
27 జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
-
Oct 05, 2025 08:18 IST
ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు
ఏలూరు ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో 4వ రోజు ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు
నేడు భూ వరాహ స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న
ఉదయం హనుమద్ వాహనం వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం
రాత్రి 7 గంటలకు ఎదుర్కోల ఉత్సవం
అనంతరం వెండి శేష వాహనంపై స్వామివారి గ్రామోత్సవం
-
Oct 05, 2025 07:27 IST
హోంగార్డుని చితకబాదిన వైసీపీ కార్యకర్తలు
విజయనగరం గుర్ల మండలం జమ్ములో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ
హోంగార్డుని చితకబాదిన వైసీపీ కార్యకర్తలు
పోలీసుల లాఠీ ఛార్జ్
ఒకరికి గాయాలు
దుర్గాదేవి విగ్రహాల అనుపులో మొదలైన వివాదం