Tea: టీ తయారు చేసేటప్పుడు ఈ తప్పులు ఎప్పుడూ చేయకూడదు.. ఎందుకో తెలుసా?
ABN , Publish Date - Aug 05 , 2025 | 09:31 PM
టీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానిని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అందరికీ తెలుసు. అయితే, టీ తయారీ నుంచి తాగడం వరకు ఈ మూడు తప్పులు చేసినా ఆరోగ్యంపై దుష్భ్రభావం పడుతుంది. కాబట్టి, టీ ప్రియులు కచ్చితంగా ఆ తప్పులు ఏమిటో తెలుసుకోవాలి.
చాలా మంది భారతీయులు టీ ప్రియులు. ఉదయం ఒక కప్పు టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. కొంతమంది రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తాగుతారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తప్పకుండా చాయ్ తాగాల్సిందే అంటారు. కానీ చాలా మంది టీ తయారు చేయడం నుంచి తాగడం వరకు కొన్ని తప్పులు చేస్తారు. ఇది వారి ఆరోగ్యానికి చాలా హానికరం. పోషకాహార నిపుణుల ప్రకారం, టీ తయారుచేసేటప్పుడు నివారించాల్సిన తప్పులు, ఈ తప్పుల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఈ కథనంలో..
మొదటి తప్పు: ప్లాస్టిక్ స్ట్రైనర్ వాడటం. ఇంట్లో టీ వడకట్టడానికి చాలా మంది ప్లాస్టిక్ స్ట్రైనర్ వాడతారు. చౌకగా లభిస్తుంది కాబట్టి అందరూ ఒకే ఫిల్టర్ వాడతారు. కానీ దీనివల్ల ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. వేడి టీని ప్లాస్టిక్ స్ట్రైనర్‌లో వడకట్టినప్పుడు.. స్ట్రైనర్‌లోని ప్లాస్టిక్ కణాలు టీలోకి చేరుతాయి. ఇది మన శరీరంలోకి వెళ్లి అనేక సమస్యలను కలిగిస్తుంది. అందుకే స్టీల్ ఫిల్టర్‌లను ఉపయోగించడం మంచిది.
రెండవ తప్పు: ఒకసారి తయారుచేసిన టీని మళ్ళీ వేడి చేయడం. కొంతమంది ఒకేసారి పెద్ద మొత్తంలో టీని తయారు చేసి తాగే ముందు పదే పదే వేడి చేస్తుంటారు. ఈ పద్ధతి మంచిది కాదు. ఎందుకంటే ఇది టీలో ఆమ్లత్వాన్ని పెంచుతుంది. ఇది కడుపులో జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
మూడవ తప్పు: చాలా మంది పాలలో టీ పొడిని కలిపి టీ తయారు చేస్తారు. కానీ ఇది సరైన మార్గం కాదని పోషకాహార నిపుణులు అంటున్నారు. టీ పొడిని పాలలో మరిగించడం వల్ల దానిలోని ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్ కంటెంట్ నాశనం అవుతుంది. కాబట్టి, ముందుగా టీ పొడిని కొద్దిగా నీటిలో మరిగించి ఆపై దానికి పాలు కలపండి. టీ తయారు చేయడానికి ఇది సరైన మార్గం.
Also Read:
ఈ 5 మంది ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయి తినకూడదు.. చాలా డేంజర్..!
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండేందుకు సింపుల్ టిప్స్..!
For More Latest News