Share News

Amaravati : సీఎం చంద్రబాబు స్ఫూర్తితో.. నాయకులే మార్గదర్శకులు..

ABN , Publish Date - Aug 05 , 2025 | 09:15 PM

బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌లు మార్గదర్శులుగా మారి ముందుకు వచ్చారు. వినుకొండలోని ఎస్టీ వర్గాలకు చెందిన 100 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆంజనేయులు సీఎం చంద్రబాబుకు తెలిపారు.

Amaravati : సీఎం చంద్రబాబు స్ఫూర్తితో.. నాయకులే మార్గదర్శకులు..
GV Anjaneyulu, Bolisetti Srinivas

అమరావతి : సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సంక్షేమం, అభివృద్ధితో పాటు విలువలతో కూడిన రాష్ట్రంగా రూపొందించబడుతుంది. సీఎం తాను అనుసరిస్తున్న విధానాలతో ప్రజలతో మామైకైపోతున్న తీరును చూసి నాయకులు సైతం తమ శైలీని మార్చుకుంటూ.. ప్రజ సేవకు మొగ్గుచూపుతున్నారనడంతలో అతిశయోక్తి లేదు. తాజాగా చంద్రబాబు స్ఫూర్తితో ప్రజా ప్రతినిధులు మార్గదర్శకులుగా మారి ముందుకు వచ్చారు.


దీనిలో భాగంగా.. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌లు మార్గదర్శులుగా మారి ముందుకు వచ్చారు. వినుకొండలోని ఎస్టీ వర్గాలకు చెందిన 100 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆంజనేయులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. తాను నిర్వహిస్తున్న శివశక్తి ఫౌండేషన్ తరఫున కుటుంబాల అభిృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.


తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నుంచి ఎస్టీ వర్గాలకు చెందిన 100 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌లు తెలిపారు. కుటుంబాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. సీఎం అడుగుజాడల్లో తాము నడుస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని బొలిశెట్టి ధీమా వ్యక్తం చేశారు.


ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, విప్ జీవీ ఆంజనేయులను, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌లను అభినందించారు. నాయకులు, అధికారులు ప్రజలతో కలిసి నడవాలని సూచించారు. అప్పుడే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలి: కేటీఆర్

మిథున్‌రెడ్డి బెయిల్‌పై కోర్టు కీలక నిర్ణయం

Updated Date - Aug 05 , 2025 | 09:15 PM