Cleaning Tips: బాత్రూం బకెట్లు పసుపుగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్త వాటిలా మెరుస్తాయ్!
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:41 PM
How to remove yellow stain from plastic bucket: చాలా ఇళ్లలో, బాత్రూంలో ఉంచిన బకెట్లు, మగ్గులు మురికిగా, జిగటగా మారుతాయి. దీని కారణంగా బకెట్‌లో పసుపు రంగు కనిపించడం మొదలవుతాయి. గారపట్టినట్టినట్టుగా అసహ్యకరంగా కనిపించే ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులను ఈ సింపుల్ చిట్కాలతో మళ్లీ కొత్త వాటిలా మెరిపించేయవచ్చు.
బాత్రూంలో ఉంచిన ప్లాస్టిక్ బకెట్ తరచుగా నీరు, ధూళి, తేమ కారణంగా రంగు మారుతూ ఉంటుంది. కొన్నాళ్లకు క్రమంగా పసుపు రంగు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది చూసేందుకు చాలా వికారంగా కనిపిస్తుంది. ప్లాస్టిక్ బకెట్ నీటితో నిండి ఉండటం వల్ల దానిపై నీటి మరకలు గారపట్టినట్టుగా పేరుకుపోతాయి. ఈ మచ్చలన్నింటినీ తొలగించి శుభ్రంగా తళతళలాడేలా చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ చిట్కాలతో మురికిగా ఉన్న ప్లాస్టిక్ బకెట్, మగ్గును ఇట్టే మెరిసిపోయేలా చేయొచ్చు.
స్నానం చేయడానికి బాత్రూమ్‌కి వెళ్ళినప్పుడు బాత్ బకెట్ శుభ్రంగా లేకపోతే చిరాకు అనిపించడం సహజం. ఇల్లు పూర్తిగా శుభ్రంగా ఉండాలని, బాత్రూమ్ మెరిసేలా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ బాత్ బకెట్లు, మగ్గులను క్రమం తప్పకుండా ఉపయోగించినప్పుడు.. వాటిపై నీటి మరకలు, తెల్లటి పొరలు పేరుకుపోతాయి. ఈ మరకలు బాత్రూమ్ అందాన్ని పాడు చేస్తాయి. సాధారణంగా బాత్రూంలో ఉపయోగించే మగ్గులు, బకెట్లు రోజువారీ ఉపయోగం కారణంగా చాలా త్వరగా మురికిగా మారుతాయి. సబ్బు, నీటి మరకలు, ఆల్గే కారణంగా వాటి రంగు కూడా మారుతుంది. కొన్నిసార్లు, ఎంత స్క్రబ్ చేసినా వాటికి అంటుకున్న మొండి మరకలు అలాగే ఉంటాయి. కానీ మీరు కొన్ని కింది చిట్కాలను ప్రయత్నించినట్లయితే, బాత్ బకెట్లు, మగ్గులపై అంటుకున్న మరకలు ఇట్టే తొలగిపోతాయి.
టాయిలెట్ క్లీనర్
నీలం రంగు టాయిలెట్ క్లీనర్ సహాయంతో బాత్రూం మాత్రమే కాకుండా బాత్రూంలో ఉంచిన ప్లాస్టిక్ బకెట్‌ను కూడా శుభ్రం చేయవచ్చు. హార్పిక్‌లో ఒక చెంచా ఈనో వేసి ఈ పేస్ట్‌ను బకెట్, మురికి మగ్‌పై అప్లై చేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత స్క్రబ్ సహాయంతో రుద్ది గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.
బ్లీచ్
బ్లీచ్ తో శుభ్రం చేసే పద్ధతి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే చేతులకు గ్లౌజులు ధరించడం అవసరం. తద్వారా చేతులు బ్లీచ్ వల్ల ఎఫెక్ట్ కావు. బ్లీచ్ ను కొంచెం నీటిలో కలిపి బకెట్, మగ్ పై స్క్రబ్ సహాయంతో రుద్దండి. తరువాత శుభ్రమైన నీటితో కడగాలి. బకెట్, మగ్ కొత్తవిలా మెరుస్తాయి.
బేకింగ్ సోడా, వెనిగర్
ప్లాస్టిక్ బకెట్ పై నీటి మరకలు ఉండి గ్రీజులా పేరుకుపోతుంటే, బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి పేస్ట్ తయారు చేసుకోండి. దానికి కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బకెట్ పై అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేయండి. బకెట్ పై ఉన్న గ్రీజు, మురికి అంతా శుభ్రం అవుతుంది.
డిష్ సోప్, బేకింగ్ సోడా
ఒక చిన్న గిన్నెలో కొద్దిగా డిష్ సోప్ లిక్విడ్, బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి మందపాటి పేస్ట్ లా చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ ను బకెట్, మగ్ పై అప్లై చేసి 5-10 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత నీటితో బాగా శుభ్రం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల బకెట్, మగ్ కొత్తగా కనిపిస్తాయి.
నిమ్మకాయ, ఉప్పు
బకెట్ శుభ్రం చేయడానికి మరొక మార్గం నిమ్మకాయ, సాధారణ వంట ఉప్పు. ముందుగా, ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో కొంచెం ఉప్పు తీసుకోండి. తర్వాత సగానికి కట్ చేసిన నిమ్మకాయ ముక్కను ఉప్పు ప్లేట్‌లో ముంచి బకెట్‌ను బాగా రుద్దండి. తర్వాత బకెట్ మీద కొంచెం ఉప్పు చల్లి బ్రష్ తో స్క్రబ్ చేయండి. వీలైతే సర్ఫ్ ఉపయోగించి స్క్రబ్ చేయండి. తరువాత, నీటితో శుభ్రం చేయండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
ఓవర్ థింకింగ్ ట్రాప్‌లో పడ్డారా? పరిష్కార మార్గాలు ఇవే..
చాణక్యుని దృష్టిలో భార్య ఆశించే గుణాలు.. మీలో ఉన్నాయా?