Metturu Dam: మేట్టూరుకు జలకళ.. ఐదోసారి పూర్తి స్థాయిలో నిండిన జలాశయం
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:20 PM
డెల్టా జిల్లాలకు సాగుజలాలను, ప్రజలకు తాగునీటిని అందించే మేట్టూరు జలాశయం ఈ యేడాదిలో ఐదోసారి పూర్తిస్థాయిలో నిండింది. దీంతో ఆ జలాశయం 16 క్రష్ట్‌గేట్లను తెరచి జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు.
చెన్నై: డెల్టా జిల్లాలకు సాగుజలాలను, ప్రజలకు తాగునీటిని అందించే మేట్టూరు జలాశయం(Metturu Dam) ఈ యేడాదిలో ఐదోసారి పూర్తిస్థాయిలో నిండింది. దీంతో ఆ జలాశయం 16 క్రష్ట్‌గేట్లను తెరచి జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. నైరుతి రుతుపవన ప్రభావిత వర్షాల కారణంగా కర్ణాటకలోని కబిని, కృష్ణరాజసాగర్ డ్యాంలలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో ఆ డ్యాంల నుంచి విడుదలయ్యే అదనపు జలాలు మేట్టూరు జలాశయంలోకి ప్రవేశిస్తున్నాయి.
ఈ డ్యాం నుంచి డెల్టా జిల్లాలకు సాగుజలాలను జూన్ 12న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విడుదల చేశారు. ఆ సమయంలో డ్యాంలో ముప్పావుశాతం మేరకు నీటి నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత జూన్ 29న తొలిసారిగా పూర్తి స్థాయిలో (120 అడుగులు) జలాలతో నిండింది. అటు పిమ్మట జూలై 5న రెండోసారి, జూలై 25న నాలుగోసారి పూర్తిస్థాయిలో నీటిమట్టం నమోదైంది. ఆ తర్వాత రెండువారాలపాటు నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కావేరి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం భారీగా వర్షాలు కురవడంతో పాటూ కర్ణాటకలోని జలాశయాలలో నీటిమట్టం విపరీతంగా పెరిగింది.

దీంతో ఆ డ్యాంల నుంచి భారీ పరిమాణంలో అదనపు జలాలను విడుదల చేయడంతో మేట్టూరు డ్యాంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది. మంగళవారం ఈ డ్యాంలో నీటిమట్టం 117.45 అడుగులకు చేరింది. బుధవారం ఉదయం 8గంటలకు నీటిమట్టం 120 అడుగులకు పెరిగింది. ప్రస్తుతం డ్యాంలోకి 1,08,529 క్యూసెక్కుల జలాలు ప్రవేశిస్తున్నాయి. డ్యాం నుంచి 90 వేల క్యూసెక్కులను చొప్పున జలాలను దిగువకు వదులుతున్నారు. మేట్టూరు డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవడంతో కావేరి నదిలో ఎవరూ స్నానం చేయకూడదని అధికారులు ఆంక్షలు విధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక
Read Latest Telangana News and National News