Reationship Advice For Women: స్త్రీలు భర్తలకు సరదాకి కూడా ఈ విషయాలు చెప్పకూడదు..!
ABN , Publish Date - Sep 02 , 2025 | 08:22 PM
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండాలంటే ఒకరిపై మరొకరు బాధ్యతో వ్యవహరించాలి. కొన్నిసార్లు లౌక్యంగా కూడా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు తమ వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే ఈ విషయాలు సరదాకి కూడా భర్తతో చర్చించకూడదని మానసిక నిపుణులు అంటున్నారు.
భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకం, గౌరవం, పరస్పర ప్రేమపై ఆధారపడి ఉంటుంది. దంపతుల మధ్య ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వారి సంబంధంలో రోజూ ఏదొక విషయంలో గిల్లికజ్జాలు రావడం సహజం. కొన్ని విషయాలు తగాదాలకు దారితీస్తే.. మరికొన్ని చప్పున చల్లారిపోతాయి. కపుల్స్ ఇద్దరూ అవతలి వ్యక్తి మూడ్ బట్టి ఎవరో ఒకరు సర్దుకుపోయినప్పుడే సంసార నావ సజావుగా సాగుతుంది. అలా కాక నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తే పెనుగులాటలు కాస్తా బంధాన్ని బీటలు వారుస్తాయి.ముఖ్యంగా ఇరువురూ ఏదైనా విషయంపై చర్చించుకునేటప్పుడూ కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అలాకాక ఇష్టమొచ్చినట్టుగా మాటతూలితే పరిస్థితులు తీవ్రంగా మారతాయి. ముఖ్యంగా మహిళలు హాస్యానికి కూడా ఈ మాటలు తమ భర్తతో డిస్కస్ చేయకూడదని రిలేషన్ షిప్ నిపుణులు అంటున్నారు.
భర్తను ఇతరులతో పోల్చడం
చాలా మంది మహిళలు ఈ తప్పు ఎక్కువగా చేస్తుంటారు. 'చూడండి, అతను తన భార్యకు గోల్డ్ చైన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. మా నాన్నే నీకంటే నన్ను బాగా చూసుకుంటాడు తెల్సా. నా ఫ్రెంఢ్ భర్త ఆమెను వారానికో టూర్ తీసుకెళ్తాడు. కానీ,మీరు మాత్రం పట్టించుకోరు.' ఇలా ఏదొకటి ఫిర్యాదులాగా స్త్రీలు తమ భర్తను ఇతర పురుషులతో పోలుస్తారు. అతనిని తక్కువ చేసి చూస్తారు. మీరు మీ భర్తను ఎప్పుడూ ఇలా ఇతరులతో పోల్చకూడదు. ఇలా చేయడం వల్ల అతనిని మానసికంగా బాధపెడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు.. ఈ మాటల వల్ల మీ భర్తకు మీపై ఉన్న ప్రేమ తగ్గే అవకాశం ఉంది.
భర్తను, అతని కుటుంబాన్ని అవమానించడం
చాలా మంది వివాహిత స్త్రీలు తమ భర్తలను, వారి భర్తల కుటుంబాలను అవమానించే, అగౌరవపరిచే పనులు చేస్తారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. ముఖ్యంగా భర్త తల్లిని తరచూ గురించి చెడుగా చెప్పడం లాంటివి చేయకూడదు. ఇది కచ్చితంగా మీ భర్త మనోభావాలను దెబ్బతీస్తుంది. కాబట్టి, మహిళలు భర్తను, అతని కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుటుంబాల మధ్య సంబంధాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
భర్త కష్టాలను ఎగతాళి చేయడం
ప్రతి పురుషుడు తన కుటుంబాన్ని, భార్యను, పిల్లలను సంతోషంగా చూసుకోవడానికి పగలూ, రాత్రి కష్టపడతాడు. అయితే, కొంతమంది స్త్రీలు తమ భర్త కష్టాలను చాలా సార్లు అభినందించకుండా ఎగతాళి చేస్తారు. నువ్వు నా కోసం ఏమీ చేయవు అని అంటుంటారు.అలాగే భర్త మానసిక స్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలి. బాధ, సంతోషంలో మద్ధతుగా నిలవాలి.అప్పుడు ఇరువురి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది.
నిద్ర టైంలో గొడవలు
భార్యాభర్తలు బెడ్ రూమ్ లో అత్యంత సన్నిహితంగా ఉంటారు. ప్రేమగా మాట్లాడుకునేందుకు ఇదే అనువైన సమయం. కానీ, కొంతమంది మహిళలు ఈ సమయంలో చర్చలు, వాదనలు మొదలుపెడతారు. కంప్లెంట్స్ కోసం వేదికగా మార్చుకుంటారు. ఇలా చేస్తే బదులుగా ప్రేమతో ఉంటే ఇద్దరికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రేమ కూడా బలపడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఎక్కువసేపు సన్ గ్లాసెస్ ధరించడం వల్ల కళ్ళు బలహీనపడతాయా?
For More Latest News