Share News

Chapati VS Rice: చపాతీ VS అన్నం.. నిద్రకు ఏది మంచిది?

ABN , Publish Date - Sep 02 , 2025 | 03:16 PM

చాలా మంది రాత్రి అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? అని అయోమయంలో పడతారు. ముఖ్యంగా మంచి నిద్ర కోసం ఏది బెస్ట్ అనే సందేహం ఎక్కువగానే ఉంటుంది. అయితే, రాత్రి భోజనానికి ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

Chapati VS Rice: చపాతీ VS అన్నం.. నిద్రకు ఏది మంచిది?
Chapati Or Rice

ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది రాత్రి అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? అని అయోమయంలో పడతారు. ముఖ్యంగా మంచి నిద్ర కోసం ఏది బెస్ట్ అనే సందేహం ఎక్కువగానే ఉంటుంది. అన్నం, చపాతీ రెండూ మనకు కావాల్సిన శక్తిని అందించే కార్బోహైడ్రేట్లతో నిండివుంటాయి. అయితే, అవి నిద్రపై ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


కార్బోహైడ్రేట్లు శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి. ఇవి మనకు రిలాక్స్ అయ్యే ఫీలింగ్‌ని ఇచ్చి మంచి నిద్రకు సహాయపడతాయి. అయితే, కార్బోహైడ్రేట్లు కూడా రెండు రకాలవుంటాయి. సాధారణ కార్బోహైడ్రేట్లు (తెల్ల బియ్యం వంటివి) త్వరగా జీర్ణమవుతాయి, అయితే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు (గోధుమ చపాతీ వంటివి) నెమ్మదిగా జీర్ణమవుతాయి.


అన్నం తినడం మంచిదా?

రాత్రిపూట చాలా మందికి అన్నం తినడం అలవాటు. బియ్యం తేలికగా జీర్ణమవుతుంది. మరికొన్ని పరిశోధనల ప్రకారం, బియ్యం తినడం వల్ల ట్రిప్టోఫాన్ అనే పదార్థం మెదడులో విడుదల అవుతుంది, ఇది నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే, ఎక్కువగా బియ్యం తింటే రాత్రి మళ్లీ ఆకలి వేసే అవకాశం ఉంది. అంతేకాకుండా రక్తంలో షుగర్ స్థాయి పెరిగే ఛాన్స్ ఉంటుంది.


చపాతీ తినడంలో ప్రయోజనాలేంటి?

గోధుమ చపాతీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణమై శరీరానికి స్థిరమైన శక్తిని ఇస్తుంది. చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు లేదా బరువు చూసుకునేవారు చపాతీని ఎంచుకోవచ్చు. అయితే, చపాతీ జీర్ణం కావడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. ఎక్కువ తింటే కడుపు బరువుగా అనిపించవచ్చు.


నిద్రకు ఏది బెటర్?

అన్నం , చపాతీ రెండూ మంచివే. కానీ మితంగా తినాలి. మామూలు పరిమాణంలో కూరగాయలు, ప్రోటీన్లతో కలిసి తీసుకుంటే మంచి నిద్రతోపాటు, ఆరోగ్యానికి కూడా మంచిదే. తేలికగా, త్వరగా నిద్ర పడాలంటే అన్నం బెటర్ అని, బరువు తగ్గాలనుకుంటే, షుగర్ లెవల్స్ బ్యాలెన్స్‌ చేయాలంటే చపాతీ మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

పురుగులమందులు ఎక్కువ ఉండేది ఈ పండ్లలోనే.. జర జాగ్రత్త..

కల్పవృక్షం.. కొబ్బరిచెట్టు. నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం

For More Latest News

Updated Date - Sep 02 , 2025 | 03:16 PM