Wearing Sunglasses For a long time: ఎక్కువసేపు సన్ గ్లాసెస్ ధరించడం వల్ల కళ్ళు బలహీనపడతాయా?
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:24 AM
ఎక్కువసేపు సన్ గ్లాసెస్ ధరించడం వల్ల కళ్ళు దెబ్బతింటాయనే అపోహ ఉంది. అయితే, ఇది ఎంత వరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: సూర్యకాంతి నుండి కళ్ళను రక్షించడానికి చాలా మంది సన్ గ్లాసెస్ పెట్టుకుంటారు. ఎందుకంటే సూర్యకాంతిలో ప్రకాశవంతమైన కాంతి, UV కిరణాలు ఉంటాయి. ఇవి కళ్ళకు హాని కలిగిస్తాయి. కానీ, చాలా మంది సన్ గ్లాసెస్‌ను అదే పనిగా ధరించడం వల్ల కళ్ళు బలహీనపడతాయని నమ్ముతారు. అయితే, ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు తెలుసుకుందాం..
సూర్య కిరణాలు చర్మానికే కాకుండా కళ్ళకు కూడా హానికరం. అవి చికాకు, పొడిబారడం, రెటీనా దెబ్బతినడం, కళ్ళలో కంటిశుక్లం వంటి సమస్యలను కలిగిస్తాయి. సన్ గ్లాసెస్ ఈ హానికరమైన కిరణాల నుండి కళ్ళను రక్షిస్తాయి. సూర్యుడి నుండి వచ్చే కాంతిని తగ్గిస్తాయి.
ఎండ నుండి రక్షించుకోవడానికి ధరించే అద్దాలు కళ్ళను బలహీనపరుస్తాయని చాలా మంది నమ్ముతారు లేదా భయపడతారు. ప్రతిరోజూ సన్ గ్లాసెస్ ధరిస్తే కళ్ళ బలం తగ్గుతుందని అనుకుంటారు. కానీ, సన్ గ్లాసెస్ కళ్ళ కాంతిని గ్రహించే సామర్థ్యాన్ని దెబ్బతీయవు. పెరుగుతున్న వయస్సు, ఎక్కువగా స్క్రీన్ చూడటం, జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. అంతే తప్ప సన్ గ్లాసెస్ ధరించడం వల్ల కళ్ళు దెబ్బతింటాయనేది కేవలం అపోహ మాత్రమే.
మంచి నాణ్యత గల సన్ గ్లాసెస్ ధరించడం వల్ల UV కిరణాల నుండి కళ్ళకు 99 నుండి 100 శాతం రక్షణ లభిస్తుంది. మీరు సుదీర్ఘ ప్రయాణంలో ఉంటే, వాతావరణం ప్రకాశవంతంగా ఉంటే సన్ గ్లాసెస్ ప్రకాశవంతమైన కాంతిని నేరుగా కళ్ళలోకి పడకుండా నిరోధిస్తాయి.
UV రక్షిత అద్దాలు ధరించడం వల్ల కంటిశుక్లం, మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మీరు బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ కళ్ళను దుమ్ము, ధూళి నుండి కూడా రక్షిస్తాయి. UV400 రక్షణ ఉన్న సన్ గ్లాసెస్ తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే, కళ్ళు దెబ్బతినవచ్చు.
Also Read:
కొత్త పర్సు తీసుకున్నారని పాత పర్సు పడేస్తున్నారా? ఈ పరిహారం మార్చిపోకండి..!
వామ్మో.. తిన్న తర్వాత నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే డయాబెటిస్‌కు సంకేతమా.!
For More Latest News