Nail Biting Habit: గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారు ఎలాంటి వ్యక్తులో తెలుసా?
ABN , Publish Date - Sep 07 , 2025 | 09:05 PM
గోళ్లు కొరకడం మంచిది కాదు. దరిద్రం అంటూ పెద్దవాళ్లు చెప్పడం వినే ఉంటారు. ఈ చెడు అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిసిందే. అయినా చాలా మంది గోళ్లు కొరికే అలవాటు మానుకోలేరు. ఎందుకంటే, ఈ లక్షణాలున్న వ్యక్తులే గోళ్లు కొరికే అలవాటు నియంత్రించుకోలేరని వ్యక్తిత్వ నిపుణులు అంటున్నారు.
చాలా మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఆరోగ్యానికి హానికరం అని చెప్పినప్పటికీ కొంతమంది వారికే తెలియకుండా ఎప్పుడుపడితే అప్పుడు.. ఎక్కడపడితే అక్కడ గోళ్లు కొరికేస్తూ ఉంటారు. ఈ అలవాటు వదిలించుకోవాలని ఎంత ప్రయత్నించినా మానుకోలేరు. ఎందుకంటే, ఆ వ్యక్తి రహస్య వ్యక్తిత్వం, స్వభావం వల్లే ఈ చెడు అలవాటు నియంత్రించుకోలేరు. అవును, మన పాదాల ఆకారం, ముక్కు ఆకారం, జుట్టు, వేళ్ల ఆకారం, అరచేతి రేఖల ద్వారా జ్యోతిష్యులు వ్యక్తిత్వం గురించి చెప్పినట్టుగానే.. గోళ్లు కొరికే అలవాటు కూడా ఒక వ్యక్తి రహస్య వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందనివ్యక్తిత్వ నిపుణులు అంటున్నారు. ఇంతకీ, గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారి సీక్రెట్ పర్సనాలిటీ ఏంటో మీకూ తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
పర్ఫెక్షనిస్టులు
ప్రతిదీ పక్కాగా ఉండాలని కోరుకునే పర్ఫెక్షనిస్టులకు గోళ్లు కొరికే అలవాటు ఉంటుందట. వీరు తమ పనిలో చిన్న తప్పు లేదా తేడాను కూడా ఇష్టపడరు. అంచనాల ప్రకారం పని జరగనప్పుడు ఒత్తిడికి గురవుతారు. విసుగు చెందినప్పుడో.. నిరాశగా ఉన్న సమయంలోనో.. గోళ్లను కొరికుతూ ఉంటారు.
అతిగా ఆలోచించేవారు
కొంతమంది చిన్న విషయాల గురించి అవసరానికి మించి ఆలోచిస్తారు. ఇలా పరిస్థితులను పట్టించుకోకుండా గంటల తరబడి అతిగా ఆలోచించేవారిలో ఒత్తిడి, ఆందోళన అధికం. అందుకే వీరు తరచూ అసహనంతో గోళ్లు కొరుకుతూ కనిపిస్తుంటారు.
అంతర్ముఖులు
నలుగురిలో కలవలేని మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వ్యక్తితో మాట్లాడేందుకు జంకుతాడు. తన అభిప్రాయం స్పష్టంగా, బాహాటంగా చెప్పుకునేందుకు ధైర్యం చాలక సతమతమవుతూ ఉంటాడు. ఇలాంటి వారు సిగ్గు, అభద్రతాభావానికి గురైనప్పుడు గోళ్లు కొరుకుతారు. లేదంటే స్వంత ఆలోచనల్లో మునిగి ఉన్నప్పుడు ఇలా చేస్తారు.
ఓపిక లేకపోవడం
గోళ్లు కొరికే అలవాటు ఓపిక లేకపోవడాన్ని ఎత్తి చూపుతుంది. పని ఆలస్యం అయినప్పుడు లేదా వేచి ఉండాల్సి వచ్చినప్పుడు కొంతమంది కోపంలో గోళ్లు కొరకడం ప్రారంభిస్తారు. వారు త్వరగా ఎదుటి వ్యక్తి నుంచి ఫలితాలను ఆశిస్తున్నారని దీని అర్థం. అయితే, వీరు ఉత్సాహభరితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు.
Also Read:
క్యాన్సర్ నుంచి డయాబెటిస్ వరకు.. మందులపై జీఎస్టీ తగ్గింపు వల్ల లాభపడే వారు వీరే!
డైలీ టమోటాలు తింటే నిజంగా కిడ్నీలో రాళ్లు వస్తాయా?
For More Latest News