Hangover Hacks: తాగింది దిగలేదా? హ్యాంగోవర్ కోసం అల్టిమేట్ హ్యాక్స్ ..!
ABN , Publish Date - Sep 04 , 2025 | 08:30 PM
రాత్రిపూట ఎక్కువగా తాగితే ఉదయం హ్యాంగోవర్ వల్ల ఉత్సాహంగా ఉండలేరు. తలనొప్పి, వికారం, నొప్పులు వస్తాయి. హ్యాంగోవర్ నుంచి బయటపడటానికి వివిధ మార్గాలను ప్రయత్నించినా కుదరదు. అటువంటప్పుడు ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి. ఎనర్జిటిక్‌గా ఉంటారు.
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ ప్రజలు ఈ అలవాటును ఒకేసారి మానుకోలేరు. ప్రతిరోజూ తాగకపోయినా కొందరు వారానికి కనీసం ఒకసారైనా మద్యం తాగుతారు. కానీ, ఉదయం నిద్రలేవగానే తీవ్రమైన తలనొప్పి, వికారం, శరీర నొప్పులు రావడం సాధారణం. ఇలాంటప్పుడు రోజువారీ పనులు చేసుకోవడం కష్టంగా మారుతుంది. హ్యాంగోవర్ వచ్చినప్పుడు ఏ పని చేయలేరు. దేనిపైనా దృష్టి పెట్టలేరు. అటువంటి పరిస్థితుల్లో హ్యాంగోవర్‌ను తక్షణమే తగ్గించడానికి ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు ఉన్నాయి. ఈ ట్రిక్స్ ఫాలో అయితే ఈజీగా ఉపశమనం పొందవచ్చు.
టమోటా రసం
రాత్రిపూట ఎక్కువగా మద్యం సేవించాక ఉదయం నిద్రలేవగానే తల బరువుగా అనిపించడం, తలనొప్పి, వికారం, బాడీ పెయిన్స్ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ స్థితినే హ్యాంగోవర్ అంటారు. ఈ సందర్భంలో టమాటో రసం హ్యాంగోవర్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రసంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో మంట, కండరాల నొప్పి, తలనొప్పిని తగ్గిస్తాయి. అంతే కాదు, ఇది వికారం, వాంతుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.
దోసకాయ రసం
దోసకాయ రసం తాగడం వల్ల కూడా హ్యాంగోవర్ నుండి బయటపడవచ్చు. దోసకాయను నీటిలో నానబెట్టి గంట తర్వాత ఆ నీటిని తాగాలి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇది హ్యాంగోవర్ నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. అవసరమైతే నిమ్మకాయను కూడా ఈ రసంలో కలుపుకోవచ్చు.
కొబ్బరి నీళ్లు
మీకు తెలుసా? కొబ్బరి నీళ్ళు హ్యాంగోవర్ తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ నీటిని తాగడం వల్ల హ్యాంగోవర్ నుండి కోలుకోవచ్చు. అంతే కాదు, ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
అల్లం టీ
అల్లం టీ హ్యాంగోవర్‌ను త్వరగా తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. హ్యాంగోవర్‌ను త్వరగా వదిలించుకోవడానికి బాగా పనికొస్తుంది. ఈ టీ తాగడం వల్ల రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ఆఫర్.. కేవలం 18 వేలలో అయోధ్య, సిమ్లా, రాజస్థాన్ ట్రిప్
పెళ్లైన స్త్రీలు తప్పనిసరిగా గాజులు ఎందుకు ధరించాలి?
For More Latest News