Share News

Reasons To wear Bangles: పెళ్లైన స్త్రీలు తప్పనిసరిగా గాజులు ఎందుకు ధరించాలి?

ABN , Publish Date - Sep 04 , 2025 | 10:47 AM

స్త్రీలు తప్పనిసరిగా గాజులు ధరించాలని మన పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. అయితే, పెద్దలు అలా చెప్పడానికి ముఖ్య కారణాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Reasons To wear Bangles: పెళ్లైన స్త్రీలు తప్పనిసరిగా గాజులు ఎందుకు  ధరించాలి?
Reasons to wear Bangles

ఇంటర్నెట్ డెస్క్: స్త్రీలు తప్పనిసరిగా గాజులు ధరించాలని మన పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. చేతులకు గాజులు ధరించడం కేవలం అలంకారమే కాదు.. శుభం, రక్షణకు కూడా సూచికగా భావిస్తారు. ముఖ్యంగా పెళ్లైన మహిళలు గాజులు వేసుకుంటే వారికి సౌభాగ్యం పెరుగుతుందనే నమ్మకం ఉంది. పుట్టిన చిన్నారులకు కూడా నల్ల గాజులు వేయడం వల్ల దోషాలు, దృష్టి వంటి అపశకునాలు తొలగిపోతాయని చెబుతారు.


అదృష్టం కలిసి వస్తుంది

గాజులు మతపరమైన సంప్రదాయాలను, శాస్త్రీయ ప్రయోజనాలను, జ్యోతిష్య ప్రాముఖ్యతను, అలంకార విలువను కలిగి ఉంటాయి. చేతులు ఖాళీగా ఉండటం అశుభకరంగా పరిగణిస్తారు. శాస్త్రీయంగా, గాజులు ధరించడం వల్ల సానుకూలత లభిస్తుందని, శారీరక ఆరోగ్యానికి కూడా మంచిదని నమ్ముతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గాజులు ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది.


ముత్తైదుతనం

గాజుల మృదువైన శబ్దం ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఆడవారిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి వారు చేతులకి గాజులు ధరించినప్పుడు ఆ గృహంలో శాంతి, శ్రేయస్సు వర్ధిల్లుతుందని పెద్దలు చెబుతారు. బంగారం గాజులు ఎంత విలువైనవో, అంతే విలువ మట్టి గాజులకు కూడా ఉందని పెద్దలు చెబుతారు. అవి ముత్తైదుతనానికి సంకేతంగా భావిస్తారు. కుంకుమతో పాటు గాజులను అమ్మవారికి సమర్పించే సంప్రదాయం కూడా ఉంది. అమ్మవారి దయను పొందడానికి, ఆమె ఆశీర్వాదాలను అందుకోవడానికి, దాంపత్య జీవితంలో ఆనందం, సుఖం కలగాలని కోరుతూ భక్తులు అమ్మవారికి గాజులు సమర్పిస్తారు.


అలాగే, గర్భవతులు గాజులు ధరించడానికి కూడా ప్రధాన కారణలు ఉన్నాయని మన పెద్దలు చెబుతారు. గాజుల శబ్దం శిశువు మెదడు అభివృద్ధికి సహాయపడుతుందని, ముఖ్యంగా గర్భం దాల్చిన ఏడో నెల తర్వాత శిశువు శబ్దాలను వినగలదని భావిస్తారు. ఇంకా, గాజులు ధరించడం వల్ల మహిళలు మానసికంగా ప్రశాంతంగా ఉండటంతో పాటు, జీవక్రియలు సమతుల్యంగా ఉంటాయని పూర్వకాలంలో నమ్మేవారు. అందువల్ల ప్రతి మహిళ, ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు గాజులు తప్పనిసరిగా ధరించాలని మన సంప్రదాయం చెబుతోంది. గాజులు సౌందర్యానికే కాకుండా, సౌభాగ్యానికి శుభానికి కూడా ప్రతీకలుగా నిలుస్తాయి.


Also Read:

జీవితంలో దుఃఖాన్ని అధిగమించడానికి అలవర్చుకోవలసిన 4 పద్ధతులు ఇవే.!

టేకాఫ్ అవుతుండగా ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి

For More latest News

Updated Date - Sep 04 , 2025 | 12:03 PM