Share News

IRCTC Special Tour package: ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ఆఫర్.. కేవలం 18 వేలలో అయోధ్య, సిమ్లా, రాజస్థాన్ ట్రిప్

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:39 AM

ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. కేవలం 18 వేలలో అయోధ్య, సిమ్లా, రాజస్థాన్ ట్రిప్‌కు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను లేట్ చేయకుండా తెలుసుకుందాం..

IRCTC Special Tour package: ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ఆఫర్.. కేవలం 18 వేలలో అయోధ్య, సిమ్లా, రాజస్థాన్ ట్రిప్
IRCTC

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికుల కోసం అద్భుతమైన టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. కేవలం రూ.18 వేలకే అయోధ్య, సిమ్లా, రాజస్థాన్ వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్యాకేజీల్లో రైలు ప్రయాణం, స్థానిక దర్శనాల కోసం క్యాబ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ప్యాకేజీల పూర్తి సమాచారాన్ని IRCTC వెబ్‌సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.. తర్వాత మీకు నచ్చిన ప్యాకేజీ కోసం టికెట్‌ను ఆన్‌లైన్‌లో ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం..


శ్రీ రామ దర్శన ప్యాకేజీ

  • కోల్‌కతా నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది.

  • ఈ ప్యాకేజీలో మీరు అయోధ్య, వారణాసి ప్రాంతాలను దర్శించుకోవచ్చు.

  • సందర్శనా స్థలాలను సందర్శించడానికి క్యాబ్‌ల సౌకర్యం కూడా ఉంటుంది.

  • IRCTC వెబ్‌సైట్‌లో రామ్ మందిర్ దర్శన్ విత్ కన్ఫార్మ్డ్ ట్రైన్ టికెట్ అనే పేరుతో ప్యాకేజీ అందుబాటులో ఉంది.

  • రైల్వే అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ఛార్జీలు:

  • ఇద్దరు కలిసిన టూర్ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఛార్జీ: రూ.16,150

  • ముగ్గురికి కలిసిన టూర్ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఛార్జీ: రూ.15,750

  • పిల్లలకు: రూ.5,250


సిమ్లా – కుఫ్రి ప్యాకేజీ

  • ఈ ప్యాకేజీలో పర్వతాల అందమైన దృశ్యాలను చూడవచ్చు.

  • చండీగఢ్ నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రిప్ 3 రాత్రులు, 4 పగళ్లు ఉంటుంది.

  • సిమ్లా, హతు మాత దేవాలయం, నరకంద దర్శనాలు ఉంటాయి.

  • ప్యాకేజీ పేరు సిమ్లా విత్ హతు టెంపుల్ నరకంద EX చండీగఢ్.

  • ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. రైల్వే వెబ్‌సైట్ నుంచి టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు.

ఛార్జీలు:

ఇద్దరు కలిసిన టూర్ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఛార్జీ: రూ.16,360

ముగ్గురికి కలిసిన టూర్ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఛార్జీ: రూ.15,160

పిల్లలకు: రూ.12,770


3. రాజస్థాన్ ప్యాకేజీ

  • రాజస్థాన్ లోని చారిత్రక నగరాలు, అందమైన లోయలను ఆస్వాదించాలనుకుంటే, ఈ ప్యాకేజీ మీకు బాగా సెట్ అవుతుంది.

  • జైపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ 4 రాత్రులు, 5 పగళ్లు ఉంటుంది.

  • ప్యాకేజీలో క్యాబ్ సౌకర్యం కూడా ఉంది.

  • జైపూర్, అజ్మీర్, పుష్కర్, ఉదయపూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు.

  • ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. రైల్వే అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ఛార్జీలు:

  • ఇద్దరు కలిసిన టూర్ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఛార్జీ: రూ. 12,840

  • ముగ్గురికి కలిసిన టూర్ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఛార్జీ: రూ. 11,910

  • పిల్లలకు: రూ. 10,530


ముఖ్యమైన విషయం

ఈ ప్యాకేజీలు సెప్టెంబర్ 15లోపు బుక్ చేసుకోవాలి. రైల్వే అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇది మతపరమైన యాత్ర అయినా, పర్వత ప్రాంత పర్యటన అయినా, చారిత్రక ప్రదేశాల సందర్శన అయినా బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్ ప్యాకేజీ ద్వారా IRCTC బంపర్ ఆఫర్ ఇస్తోంది. సో లేట్ చేయకుండా వెంటనే టికెట్ బుక్ చేసుకుని, లగేజ్ ప్యాక్ చేసుకుని ట్రిప్‌కు రెడీగా ఉండండి.


Also Read:

ఖరీదైన నౌక.. సముద్రంలోకి వెళ్లిన వెంటనే మునక.. అసలేం జరిగిందంటే..

జీవితంలో దుఃఖాన్ని అధిగమించడానికి అలవర్చుకోవలసిన 4 పద్ధతులు ఇవే.!

For More Latest News

Updated Date - Sep 04 , 2025 | 01:19 PM