Share News

Luxury yacht sinks: ఖరీదైన నౌక.. సముద్రంలోకి వెళ్లిన వెంటనే మునక.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Sep 04 , 2025 | 10:21 AM

అది ఒక విలాసవంతమైన నౌక. దాని తయారీకి దాదాపు 8.74 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అయితే అది సముద్రంలోకి ప్రవేశించిన వెంటనే మునిగిపోయి అందరికీ షాకిచ్చింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Luxury yacht sinks: ఖరీదైన నౌక.. సముద్రంలోకి వెళ్లిన వెంటనే మునక.. అసలేం జరిగిందంటే..
luxury yacht sinks

అది ఒక విలాసవంతమైన నౌక. దాని తయారీకి దాదాపు 8.74 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అయితే అది సముద్రంలోకి ప్రవేశించిన వెంటనే మునిగిపోయి అందరికీ షాకిచ్చింది (yacht launch fail). ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టర్కీలోని జోంగుల్డాక్ తీరంలో ఈ ఘటన జరిగింది. మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో ఈ లగ్జరీ నౌకను తయారు చేశారు (yacht accident).


మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో ఒక మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ నౌకను తయారు చేశారు. మంగళవారం ఈ నౌక కొంతమంది ప్రయాణికులు, సిబ్బందితో సముద్రయానం ప్రారంభించింది. అయితే సముద్రంలోకి ప్రవేశించిన పది నిమిషాల్లోపే ఈ నౌక తిరగబడి మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ వెంటనే నీటిలోకి దూకి ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ ప్రమాదం సముద్రం ఒడ్డునే జరగడంతో అందరూ ప్రాణాలను కాపాడుకోగలిగారు (boat sinking video).


ఆ నౌక మునిగిపోతున్నప్పుడు దాని కెప్టెన్ డెక్ మీద చివరి వరకు నిల్చుని నిరుత్సాహంగా చూస్తూ ఉండిపోయాడు. చివరకు చేసేదేం లేక అతడు కూడా నీటిలోకి దూకి బయటకు వచ్చేశాడు (yacht owner jumps into sea). నౌక మునిగిపోవడానికి గల కారణాలు పూర్తిగా బయటకు రాలేదు. ఈ ప్రమాద ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని నిర్వాహకులు తెలిపారు. నౌక మునిగిపోవడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.


ఇవి కూడా చదవండి..

ఇన్ని తెలివితేటలు ఎక్కడివి భయ్యా.. ఈ బైక్‌ను దొంగిలించడం ఎవరి తరమూ కాదు..


మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలో మిస్టేక్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 04 , 2025 | 10:21 AM