Bhagavad Gita Friendship Advice: శ్రీకృష్ణుని ప్రకారం ఈ 5 మందితో స్నేహం మహాపాపం.. కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు..
ABN , Publish Date - Sep 03 , 2025 | 08:56 PM
స్నేహబంధంలోని మాధుర్యానికి వెలకట్టలేరు. కన్నవాళ్లతో సైతం పంచుకోలేని బాధను ఫ్రెండ్ తో మాత్రమే చెప్పుకోగలరు. అలా అని పరిచయమైన ప్రతి ఒక్కరూ మిత్రుడు అవుతారనుకుంటే పొరపాటు. ముఖ్యంగా 5 రకాల వారితో స్నేహం శిక్షార్హం అని శ్రీ కృష్ణుడు గీతలో బోధించాడు.
జీవితంలో స్నేహం అనేది ఒక విలువైన సంబంధం. నమ్మినవారితో చెలిమి జీవితాన్ని ఎంత అందంగా మారుస్తుందో.. చెడ్డవారితో, మోసగాళ్లతో స్నేహం అంతలా మిమ్మల్ని ముంచేస్తుంది. అందుకే పరిచయమైన వారంతా ప్రాణస్నేహితులని భావించడం తెలివైన పనికాదు. కొంతమందితో ఫ్రెండ్షిప్ మీ ఆనందానికి, ఆత్మవిశ్వాసానికి, ఎదుగుదలకు ఆటంకంగా మారవచ్చు. చెడ్డ వ్యక్తులు క్రమంగా మీ జీవితంలో ప్రతికూలతను నింపి మిమ్మల్ని మానసికంగా కుంగిపోయేలా చేయవచ్చు. అందువల్ల, స్నేహితులను ఎన్నుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏఏ వ్యక్తులను దూరంగా ఉంచాలో తెలుసుకోవాలి. అలాంటి కోవకే చెందిన ఓ 5 రకాల వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తాగుబోతుతో స్నేహం
సామాజికంగా ఎలాంటి కట్టుబాట్లతో నడుచుకోవాలని గీతలో శ్రీ కృష్ణుడు స్పష్టంగా కొన్ని పరిమితులు విధించాడు. ఉదాహరణకు, మాదకద్రవ్యాలకు బానిసైన వ్యక్తికి తన ఆలోచనలపై నియంత్రణ ఉండదు. మత్తులోకి కూరుకుపోయిన తర్వాత మంచికి, చెడుకు మధ్య ఉన్న తేడాను మరచిపోతాడు. కాబట్టి, తాగుబోతుతో ఎప్పుడూ స్నేహం చేయకూడదు.
అసూయపడే వ్యక్తి
ఇతరుల పట్ల ఎప్పుడూ ద్వేషం, అసూయ భావాలు కలిగి ఉండే వ్యక్తి నిత్యం కుళ్లుతో రగిలిపోతుంటాడు. కపట స్వభావం ఉన్న ఇలాంటి వ్యక్తితో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. ఇతరుల సంపద, అందం చూసి అసూయ పడేవారు కుట్రపూరిత మనస్తత్వం కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తితో స్నేహం ప్రమాదకరం కావచ్చు.
సోమరి వ్యక్తి
జీవితంలో విఫలమైన సోమరి వ్యక్తితో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. అతను తన సహవాసం ద్వారా ఇతరులను సోమరిగా చేయగలడు. ఇది అతడి మిత్రుల వైఫల్యానికి దారితీయడమే కాకుండా వారి మొత్తం జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది.
కోపిష్ఠి
ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే వ్యక్తి బుద్ధిహీనుడిలా ప్రవర్తిస్తాడు. తనపై తాను నియంత్రించుకోలేని వ్యక్తి సమయం సందర్భం చూసుకోకుండా ఇతరులతో ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తితో స్నేహం చేయడం మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది.
అంధ భక్తుడు
మతంపై గుడ్డి నమ్మకం ఉంచి మనస్సాక్షిని ఉపయోగించకుండా మూఢనమ్మకాలలో మునిగితేలే వ్యక్తి విచక్షణతో ఆలోచించడు. తన అభిప్రాయమే కరెక్ట్ అని వాదిస్తాడు. ఇలాంటి వ్యక్తులు ఏవైనా విషయాలు చెప్పినా అర్థం చేసుకోలేని వీరు స్నేహానికి అర్హులు కాదు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
కుట్రదారుడు హరీశే.. కవిత సంచలన ఆరోపణలు
త్వరగా కోటీశ్వరులు కావాలంటే నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి..
For More Latest News