Girls Dislike Qualities in Boys: అబ్బాయిలో ఈ లక్షణాలుంటే ఏ అమ్మాయీ ఇష్టపడదు..!
ABN , Publish Date - Sep 09 , 2025 | 08:35 PM
చాలా మంది యువకులు తమకు నచ్చిన అమ్మాయితో ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. వారు ఆ అమ్మాయికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. అప్పుడు కొంత వింతగా తోచింది మాట్లాడేస్తుంటారు. కానీ, పొరపాటున ఈ లక్షణాలు ప్రదర్శించినా ఏ అమ్మాయీ ఇష్టపడదని నిపుణులు అంటున్నారు.
ఎక్కువగా అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయి మెప్పు పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆ అమ్మాయికి దగ్గరవడానికి తోచింది చేస్తుంటారు. ఫ్రెండ్స్ సలహాలతో ఆలోచించకుండా ఏదేదో చేసేవారూ కొందరుంటారు. అయితే, మీరు నిజంగా ఇష్టపడే అమ్మాయికి దగ్గర కావాలంటే ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందే అంటున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. పొరపాటున ఈ లక్షణాలు ప్రదర్శించినా కచ్చితంగా సదరు అమ్మాయి మిమ్మల్ని అసహ్యించుకుంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతి అబ్బాయి అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఈ విషయాల గురించి అస్సలు మాట్లాడకూడదు.
అబ్బాయిలలో ఈ లక్షణాలు అమ్మాయికి ఖచ్చితంగా నచ్చవు
అమ్మాయి ఫోన్ నంబర్ అడగడం
కొంతమంది అబ్బాయిలు అమ్మాయిని పరిచయమైన వెంటనే ఆమె ఫోన్ నంబర్ అడుగుతారు. ఏ అమ్మాయి కూడా తన ఫోన్ నంబర్ పదే పదే అడగడాన్ని ఇష్టపడదు. తనను టార్చర్ చేస్తున్నట్లుగా ఫీలవుతుంది. చిరాకుతో అసహ్యం పెంచుకునే ఛాన్స్ ఉంది.
గతాన్ని గురించి
ఎవరైనా తమ గత ప్రేమకథలను, బ్రేకప్‌లను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అలాంటి విషయాలను తమకు అత్యంత సన్నిహితులతో మాత్రమే పంచుకుంటారు. అలాంటి పరిస్థితిలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఆమె గత జీవిత కథ ఏంటని అడిగితే కచ్చితంగా ఆమెకు అది నచ్చదు. కాబట్టి, ఈ విషయం గురించి మాట్లాడకపోవడం మంచిది.
ఫోటోలు అడగడం
కొంతమంది అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిని ఆమె ఫోటోల కోసం పదే పదే అడుగుతారు. ఫోటోలు పంపమని చెప్పి వేధిస్తారు. అయితే, ఏ అమ్మాయి కూడా అబ్బాయిలో ఈ లక్షణాన్ని ఇష్టపడదు. ఈ గుణం అమ్మాయిలకు కోపం తెప్పి్స్తుందనడంలో సందేహం లేదు.
అతిగా పొగడ్తలు
అబ్బాయిల్లో ఎక్కువ మంది తమకు నచ్చిన అమ్మాయి అందాన్ని పదే పదే పొగుడుతూ ఉంటారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా బోల్డ్ గా ఉన్నావు ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటారు. అమ్మాయిలు కూడా ఈ గుణాన్ని కూడా ఇష్టపడరు. అలాంటి పొగడ్తలు వారిని అసౌకర్యానికి గురి చేస్తాయి.
ఏం చేస్తున్నావు
అమ్మాయిలకు పదే పదే మెసేజ్‌లు చేస్తూ ఏం చేస్తున్నావు అని ప్రశ్నించడం.. నాతో మాట్లాడమని అడగటం చేస్తుంటారు కొంతమంది అబ్బాయిలు. ఈ మాటలు అమ్మాయిలకు చిరాకు తెప్పిస్తాయి. అలాంటివారికి దూరంగా ఉండాలని అనుకుంటారు. అందుకే ఏ అమ్మాయినీ ఇలాంటి ప్రశ్నలు అడగవద్దు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
చెప్పులు లేకుండా నడవడం లేదా బూట్లు వేసుకుని నడవడం.. ఏది మంచిది?
తల దువ్వుకోవడానికి ఈ దువ్వెన వాడుతున్నారా? అయితే, ఈ రోజే పారవేయండి..
For More Latest News