Can Smokers Donate Blood: సిగరెట్ అలవాటు ఉన్నవారు రక్తదానం చేయకూడదా?
ABN , Publish Date - Aug 26 , 2025 | 10:24 AM
రక్తదానం అనేది ఒక సామాజిక బాధ్యత. అందుకే చాలామంది వీలైనప్పుడల్లా బ్లడ్ డొనేషన్ శిబిరాల్లో పాల్గొంటూ ఉంటారు. కానీ, కొన్ని అలవాట్లు ఉన్నవారు రక్తదానం చేయడానికి అర్హులు కారు. ఈ జాబితాలో ధూమపానం అలవాటు ఉన్నవారు ఉన్నారా? లేదా? తదితర పూర్తి విషయాలు..
భారతదేశంలో ప్రతి సంవత్సరం తీవ్రమైన వ్యాధులు లేదా ప్రమాదాల కారణంగా రక్తం లేకపోవడం వల్ల 30 లక్షలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో ప్రతి ఏడాది సుమారు 1.2 కోట్ల యూనిట్ల రక్తం అవసరం. కానీ 90 లక్షల యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందుకే తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహించడం చూసే ఉంటారు. సాధారణంగా18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా రక్తదాన శిబిరాలకు వెళ్లి తమ రక్తదానం చేయవచ్చు. ఇలా తరచూ చేస్తే రక్తం లేక ఏ రోగి మరణించే పరిస్థితి రాదు. అయితే, అందరికీ రక్తదానం చేసే అవకాశం లభించదని మీకు తెలుసా. అవును, చాలాసార్లు డయాబెటిస్, రక్తహీనత, హెచ్ఐవీ, ఎస్టీడీ వంటి కొన్ని వైద్య సమస్యల కారణంగా కొందరు వ్యక్తులు రక్తదానం చేయలేరు. ఇంతకీ, ఈ లిస్ట్‌లో స్మోకింగ్ చేసే వ్యక్తిని కూడా నిషేధించారా? ఇందుకు సమాధానం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
సిగరెట్లు తాగితే రక్త నాణ్యతపై చెడు ప్రభావం
సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, సిగరెట్లు తాగడం వల్ల ఎర్ర రక్త కణాలు దెబ్బతింటాయి. కార్బాక్సీ హిమోగ్లోబిన్ (COHb) పరిమాణం చాలా పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు. ధూమపానం రక్తంలో కాడ్మియం (Cd), సీసం (Pb) వంటి భారీ లోహాలను కూడా పెంచుతుంది. దీని కారణంగా రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఫలితంగా, రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఇది BP, హృదయ స్పందన రేటును పెంచడం ద్వారా దాత, గ్రహీత ఇద్దరి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే రక్తదానానికి కనీసం 1 నుండి 2 గంటల ముందు ధూమపానం చేయకుండా ఉండటం మంచిది.
ధూమపానం చేసేవారు రక్తదానం చేయవచ్చా?
వైద్యులు తరచుగా కొన్ని వైద్య పరిస్థితులలో రక్తదానాన్ని నిషేధిస్తారు. ఉదాహరణకు, డయాబెటిస్, రక్తహీనత, HIV, STD వంటి వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు రక్తదానం చేయడం నిషేధించబడింది. కానీ మనం ధూమపానం చేసేవారి గురించి మాట్లాడుకుంటే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రక్తదానం చేయవచ్చు. ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోండి.
రక్తదానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
ధూమపానం చేసే వ్యక్తులు రక్తదానం చేసే ముందు, తరువాత దాదాపు 3-4 గంటల పాటు పొగ తాగకూడదు.
రక్తదానం చేసే ముందు రక్తపోటును తప్పకుండా తనిఖీ చేసుకోవాలి.
బ్లడ్ డొనేట్ చేసే సమయంలో బీపీ ఎక్కువగా ఉంటే కొంతకాలం రక్తదానం చేయాలనే ఆలోచనను వదులుకోండి.
ఒక వ్యక్తికి ధూమపానం వల్ల లుకేమియా లేదా లింఫోమా ఉంటే అతడు రక్తదానం చేయకూడదు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు ఒక సంవత్సరం పాటు చికిత్స పూర్తి చేసుకున్న తర్వాతే రక్తదానం గురించి ఆలోచించాలి.
మూర్ఛ, తీవ్రమైన ఆస్తమా, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, క్యాన్సర్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధి వంటి వ్యాధులు ఉంటే రక్తదానం చేయవద్దు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఫ్రిజ్ లేకపోయినా టమోటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచే మేజిక్ ట్రిక్ ఇదే!
ఎక్కువసేపు మూత్రం ఆపుకుంటే కిడ్నీలో రాళ్లు వస్తాయా?
For Latest LifeStyle News