Share News

Wildlife Department: చిట్వేలి అడవిలో పెద్దపులి

ABN , Publish Date - Aug 26 , 2025 | 07:01 AM

కడప జిల్లా చిట్వేలి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ వన్యప్రాణి విభాగం గుర్తించింది.

Wildlife Department: చిట్వేలి అడవిలో పెద్దపులి

  • శేషాచలంలోకీ వచ్చి ఉండచ్చని అంచనా

మంగళం(తిరుపతి)/రైల్వేకోడూరు రూరల్‌/చిట్వేలి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా చిట్వేలి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ వన్యప్రాణి విభాగం గుర్తించింది. దీంతో తిరుమల అడవుల్లోకి కూడా పెద్దపులి అడుగుపెట్టి ఉండచ్చని అంచనా వేస్తున్నారు. చిట్వేలి రేంజ్‌ పరిధిలో 30 ట్రాప్‌ కెమెరాలను ఇటీవల ఏర్పాటు చేయగా... రాత్రి సమయంలోనే కాక, పగటి పూట కూడా స్వేచ్ఛగా పెద్దపులి తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి .రెండు లేదా మూడు పులులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు భావిస్తున్నారు. శ్రీశైలం టైగర్‌ ప్రాజెక్టు నుంచి నల్లమల శేషాచలం కారిడార్‌ ద్వారా ఇవి చిట్వేలి ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని అంటున్నారు.

Updated Date - Aug 26 , 2025 | 07:02 AM