Share News

Trump Tariffs Impact: అమెరికా ప్రజలపై ట్రంప్ సుంకాల ప్రభావం..వాల్‌మార్ట్‌లో భారీగా పెరిగిన ధరలు

ABN , Publish Date - Aug 10 , 2025 | 06:56 AM

డొనాల్డ్ ట్రంప్ సుంకాల వల్ల అమెరికాలోని సాధారణ ప్రజల జీవనం ఎలా మారిందో చూస్తే, లాభాలు కంటే కష్టాలు ఎక్కువవుతున్నాయి. ధరలు క్రమంగా పెరుగుతుండగా, ఆర్థిక భారమూ పెరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Trump Tariffs Impact: అమెరికా ప్రజలపై ట్రంప్ సుంకాల ప్రభావం..వాల్‌మార్ట్‌లో భారీగా పెరిగిన ధరలు
Trump Tariffs Impact

డొనాల్డ్ ట్రంప్ సుంకాల కారణంగా అమెరికా ప్రజలకు ఏదైనా లాభం జరిగిందా అంటే, లేదు కానీ ధరలు మాత్రం పెరిగి ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మెర్సిడెస్ చాండ్లర్, వాల్‌మార్ట్‌లో ధరలు ఎలా పెరిగాయో ఒక వీడియోలో చూపించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ధరల పెంపునకి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలే (Trump Tariffs Impact) కారణమని చెబుతున్నారు.


ఎంత పెరిగాయంటే

ఆ వీడియోకు ట్రంప్ టారిఫ్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆమె వీడియోలో వాల్‌మార్ట్‌లోని బట్టల సెక్షన్‌లో తిరుగుతూ, పాత ధరల ట్యాగ్‌లను కొత్త ధరలతో ఎలా రీప్లేస్ చేశారో చూపించింది. కొన్ని ట్యాగ్‌లు కొత్త ధరల స్టిక్కర్లు అతికించి ఉన్నాయి. ఫ్రెండ్స్, టారిఫ్స్ ఇప్పుడు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయంటూ చాండ్లర్ చెప్పింది.

ఉదాహరణకు ఒక చిన్న షర్ట్ ధర $6.98 నుంచి $10.98కి పెరిగింది. అలాగే, ఒక బ్యాక్‌ప్యాక్ $19.97 నుంచి $24.97కి చేరింది. అంటే 4 డాలర్లు పెరిగిందని ఆమె ఆశ్చర్యంగా చెప్పింది. మీరు నమ్మకపోతే, మీ దగ్గరలోని వాల్‌మార్ట్ లేదా టార్గెట్‌కి వెళ్లి స్వయంగా చెక్ చేయాలని సవాల్ చేసింది.


నెటిజన్ల కామెంట్స్

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ట్రంప్ సుంకాలను విమర్శించారు. ఒక యూజర్ ఇప్పుడు మనం గొప్పగా ఉన్నామా అని ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ స్లోగన్‌ను ప్రస్తావించాడు. మరో యూజర్ అమెజాన్ టారిఫ్ ఛార్జీలను చెక్‌అవుట్‌లో చూపిస్తూ ట్రంప్ ఫైర్ అయ్యాడు. ట్రంప్ ఇంటర్నేషనల్ జోకర్ అని మరో యూజర్ పోస్ట చేశాడు. ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ సహా అనేక దేశాలపై సుంకాలు విధించి చర్చల్లో నిలిచారు.


ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2025 | 07:01 AM