Plane Crash: నివాసాలపై కూలిన విమానం..
ABN , Publish Date - May 23 , 2025 | 07:39 AM
అమెరికాలోని శాన్ డియాగో పరిధిలో గురువారం వేకువజాము సెస్నా 550 అనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు విమానంలోని ముగ్గురు సిబ్బంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..
అమెరికాలోని శాన్ డియాగో పరిధిలో గురువారం వేకువజాము సెస్నా 550 అనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు విమానంలోని ముగ్గురు సిబ్బంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో సుమారు 10 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా పలు వాహనాలు కాలిపోయాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఎంత మంది ఉన్నారు, ఎంత మంది గాయపడ్డారు.. అనే వివరాలు తెలియాల్సి ఉంది.
న్యూయార్క్ (New York) టెటెరో ఎయిర్‌పోర్టు నుంచి బుధవారం రాత్రి టేకాఫ్ అయిన ఈ విమానం కన్సాస్ రాష్ట్రం విచిటాలోని కల్నల్ జేమ్స్ జబరా ఎయిర్‌పోర్టులో కాసేపు ఆగింది. అక్కడి నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం శాన్ డియాగోలోని మాంట్‌గోమెరీ–గిబ్స్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్టులో దిగాల్సి ఉంది. ఎయిర్‌పోర్టు మూడు మైళ్ల దూరంలో ఉందనగా విమానం (Plane Crash) ప్రమాదానికి గురైందని చెప్పారు. అయితే ప్రమాదానికి ముందు పైలట్ నుంచి ఎలాంటి ప్రమాద సంకేతాలు రాలేదని తెలుస్తోంది. అయితే ఆ సమయంలో దట్టంగా మంచు కురుస్తోందని, ఈ క్రమంలో కరెంట్ తీగలను తాగడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో సైనిక గృహాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇటీవల ఇలాంటి ప్రమాదాలు రెండు జరిగాయి. జనవరిలో వాషింగ్టన్ మీదుగా వెళ్తున్న ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీకొన్నాయి. అలాగే ఈ నెలలో లాస్ ఏంజిల్స్‌కు వాయువ్యంగా ఉన్న నివాస ప్రాంతంలో చిన్న విమానం కూలిపోవడంతో ఇద్దరు మరణించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News