Share News

 Lasantha Wickramasekara: మున్సిపల్‌ ఛైర్మన్‌ కాల్చివేత

ABN , Publish Date - Oct 22 , 2025 | 08:58 PM

శ్రీలంకలో మున్సిపల్ ఛైర్మన్ దారుణ హత్యకు గురయ్యారు. వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్ లసంత విక్రమశేఖర (38) బుధవారం తన కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ఇద్దరు దుండగులు ఆఫీస్‌లోకి చొచ్చుకు వెళ్లారు. క్షణం ఆలస్యం చేయకుండా తమ వద్ద ఉన్న గన్‌తో విక్రమశేఖర పై పలు రౌండ్లు కాల్పులు జరిపారు.

 Lasantha Wickramasekara: మున్సిపల్‌ ఛైర్మన్‌ కాల్చివేత
Sri Lankan Municipal Chairman

అంతర్జాతీయం, అక్టోబర్ 22: తరచూ ఏదో ఒక ప్రాంతంలో ప్రజాప్రతినిధులపై దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.. గతంలో జపాన్ లో ప్రధాని స్థాయి ఓ వ్యక్తిని పట్టపగలే దుండగులు కాల్చి చంపారు. ఆ తరువాత కూడా వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులపై దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ మున్సిపల్ ఛైర్మన్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చిచంపారు. ఈ ఘటన శ్రీలంకలో చోటుచేసుకుంది.


శ్రీలంకలో మున్సిపల్ ఛైర్మన్ దారుణ హత్య (Sri Lankan Politician Assassinated)కు గురయ్యారు. మంగళవారం వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్ లసంత విక్రమశేఖర (38) బుధవారం తన కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ఇద్దరు దుండగులు ఆఫీస్‌లోకి చొచ్చుకు వెళ్లి.. క్షణం ఆలస్యం చేయకుండా తమ వద్ద ఉన్న గన్‌తో విక్రమశేఖర (Lasantha Wickramasekara)పై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన విక్రమ శేఖరను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు.


స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. విక్రమ శేఖరను హత్య చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వెలిగామా మున్సిపల్ కౌన్సిల్ నియంత్రణపై ప్రతిపక్ష పార్టీ సామాగి జన బలవేగయ (SJB) కి అధికార పార్టీ ‘నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌’కి మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఛైర్మన్ హత్యకు గురికావడం అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.


ఇవి కూడా చదవండి..

పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 08:59 PM