Minneapolis School Shooting: స్కూల్లో కాల్పులు.. ముగ్గురి మృతి, 10 మందికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 09:40 PM
అమెరికాలో మళ్లీ కాల్పుల కల్చర్ వెలుగులోకి వచ్చింది. మిన్నెసోటాలోని మినియాపొలిస్ నగరంలో ఉన్న సౌత్ మినియాపొలిస్ అనన్సియేషన్ చర్చిలో జరిగిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఈసారి మిన్నెసోటా నియాపొలిస్ నగరంలో ఉన్న ఒక స్కూల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు ఓ దుండగుడు. సౌత్ మినియాపొలిస్‌లో ఉన్న అనన్సియేషన్ చర్చ్ అనే స్థలంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు (Minneapolis School Shooting). ఇంకా 20 మందికి గాయాలయ్యాయి. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
ఈ చర్చ్‌లో ఒక గ్రామర్ స్కూల్ కూడా ఉండటం వల్ల పిల్లలే ఎక్కువగా గాయపడినట్టు తెలుస్తోంది. దాడి సమయంలో స్కూల్‌లో పిల్లలు, టీచర్లు ఉన్నారు. కాల్పులు ప్రారంభమైన వెంటనే అక్కడ హడావుడి వాతావరణం నెలకొంది. స్థానికులు, పాఠశాల సిబ్బంది వెంటనే పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నించారు.
ఏం జరిగింది?
మిన్నియాపోలిస్‌లోని సౌత్ సైడ్‌లో ఉన్న అన్నున్సియేషన్ చర్చ్‌లో ఈ ఘటన జరిగింది. అధికారుల ప్రకారం షూటర్ కూడా మరణించిన ముగ్గురిలో ఒకరిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతను సెమీ-ఆటోమేటిక్ గన్ ఉపయోగించి, చివరికి తనకు తానే ఫైరింగ్ చేసుకుని మరణించాడట. కానీ అతని గురించి ఇంకా ఎక్కువ వివరాలు అందుబాటులో లేవు. ఈ ఘటన స్కూల్‌లో చదువుతున్న పిల్లలు, పేరెంట్స్, టీచర్లు, స్టాఫ్‌ని భయాందోళనకు గురిచేసింది.
స్పందించిన ట్రంప్
స్థానికంగా ఉండే బిల్ బీనెమాన్ అనే వ్యక్తి, ఈ చర్చ్‌కి చాలా కాలంగా హాజరవుతున్నాడు. అతను చెప్పిన ప్రకారం డజన్ల కొద్దీ కాల్పులు వినిపించాయని తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఘటనపై పూర్తి సమాచారం అందినట్లు సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందించారు. FBI ఘటనా స్థలంలో ఉందని, వైట్ హౌస్ ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తోందన్నారు. దీంతోపాటు బాధితుల తరఫున విచారం వ్యక్తం చేశారు.
ఇప్పుడు కాదు, గతంలో కూడా..
మిన్నియాపోలిస్‌లో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, మంగళవారం మధ్యాహ్నం ఒక హైస్కూల్ బయట జరిగిన షూటింగ్‌లో ఒక వ్యక్తి మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. అదే రోజు రాత్రి, నగరంలో మరో రెండు షూటింగ్‌లలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలు అమెరికాలో గన్ కల్చర్ ఎంత వ్యాపిస్తుందో మరోసారి గుర్తు చేస్తుంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి