3D Embryo Implantation: వైద్యరంగంలో మరో అద్భుతం.. IVF ప్రాసెస్ త్రీడీలో చిత్రీకరణ..
ABN , Publish Date - Aug 16 , 2025 | 09:14 PM
IVF వంటి సంతానోత్పత్తి చికిత్సల సక్సెస్ రేటును మెరుగుపరచడంలో వైద్య పరిశోధకులు మరో ముందడుగు వేశారు. మునుపెన్నడూ లేని రీతిలో మానవపిండాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టే పద్ధతిని త్రీడీలో చిత్రీకరించారు. ఆ రియల్ టైమ్ ఎలా సహాయపడుతుందో పరిశోధకులు విశ్లేషించారు.
సైన్స్ పరిశోధనల్లో మరో కొత్త రికార్డు. IVF వంటి సంతానోత్పత్తి చికిత్సల సక్సెస్ రేటును మెరుగుపరచడంలో వైద్య పరిశోధకులు మరో ముందడుగు వేశారు. మునుపెన్నడూ లేని రీతిలో మానవపిండాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టే పద్ధతిని త్రీడీలో చిత్రీకరించారు. స్పెయిన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయో ఇంజనీరింగ్ ఆఫ్ కాటలోనియా (IBEC) పరిశోధకులు ఈ అద్భుతానికి కారకులుగా నిలిచారు. బార్సిలోనాలోని డెక్సియస్ యూనివర్శిటీ హాస్పిటల్ డోనేట్ చేసిన కృత్రిమ పిండాలను ఉపయోగించి ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు.
మానవ పిండాన్ని గర్భాశయంలోకి అమర్చే రియల్-టైమ్ 3D వీడియోను శాస్త్రవేత్తలు మొదటిసారిగా రికార్డ్ చేశారు. శరీరంలో ఈ ప్రక్రియ సహజంగా ఎలా జరుగుతుందో చూపించడానికి వారు సింథటిక్ గర్భాశయ నమూనాను ఉపయోగించారు. డెక్సియస్ యూనివర్శిటీ హాస్పిటల్ డోనేట్ చేసిన ఎంబ్రియోలను ఓ ప్రయోగ ల్యాబ్ వేదికగా గర్భాశయంలో ప్రవేశపెట్టారు. మునుపెన్నడూ చూడని విధంగా వాస్తవికంగా 3D వీడియో రూపంలో రికార్డు చేశారు. IVF వంటి సంతానోత్పత్తి చికిత్సల సక్సెస్ రేటును మెరుగుపరచడంలో ఎంబ్రియో ఇంప్లాంటేషన్ వీడియో ఎలా సహాయపడుతుందో పరిశోధకులు విశ్లేషించారని ది గార్డియన్ నివేదించింది .
స్పెయిన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయో ఇంజనీరింగ్ ఆఫ్ కాటలోనియా (IBEC)లో బయో ఇంజనీరింగ్ ఫర్ రిప్రొడక్టివ్ హెల్త్ గ్రూప్‌కు ప్రధాన పరిశోధకుడు, అధ్యయన సహ రచయిత అయిన శామ్యూల్ ఓజోస్నెగ్రోస్ మాట్లాడుతూ, ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు, పిండం గర్భాశయం లోపలి పొరకు అతుక్కుపోతుంది. ఆపై మరిన్ని కణాలను తయారు చేసుకోవడం ద్వారా పెరగడం ప్రారంభిస్తుంది. ఇంప్లాంటేషన్ విఫలమైనప్పుడు గర్భం విచ్ఛిన్నమవుతుందని, వంధ్యత్వానికి ఇది అతిపెద్ద కారణాలలో ఒకటి అని పరిశోధకులు అంటున్నారు. ఇది దాదాపు 60 శాతం గర్భస్రావాలకు ఇదే కారణమవుతుంది.
Also Read:
Today Top 5 News: టు డే టాప్-5 ఆర్టికల్స్ ఇవే..
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు.. మంత్రి
For More International News and Telugu News..