Donald Trump: ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన..
ABN , Publish Date - Mar 13 , 2025 | 09:50 AM
జెలెన్స్కీ 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అంగీకరించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే తమ ప్రతినిధులు చర్చల కోసం రష్యా వెళ్లినట్లు వెల్లడించారు. ఇంకా ఏం చెప్పారనే వివరాలను ఇక్కడ చూద్దాం.

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చల కోసం తమ ప్రతినిధులు ఇప్పటికే రష్యా వెళ్లారని తెలిపారు. ఈ క్రమంలో రష్యా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తుందని బావిస్తున్నట్లు చెప్పారు. కానీ ఈ చర్చల బృందం గురించి మరింత సమాచారం అందించలేదు. ఐర్లాండ్ ప్రధానమంత్రితో జరిగిన భేటీ నేపథ్యంలో ఈ మేరకు వెల్లడించారు.
మరో రెండు రోజుల్లో
ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ 30 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత జరిగింది. రాబోయే రెండు రోజుల్లో మా ప్రతినిధులతో ఫోన్‌లో, వ్యక్తిగతంగా చర్చించిన తర్వాత మిగతా అంశాల గురించి తెలియజేస్తామని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అన్నారు. జెలెన్స్కీ బుధవారం కాల్పుల విరమణ అంశాన్ని సానుకూల దశగా అభివర్ణించారు. ఈ క్రమంలో రష్యాను అంగీకరించేలా ఒప్పించడం అమెరికా బాధ్యత అని గుర్తు చేశారు.
ఇప్పుడు రష్యా కూడా..
ఇక మాస్కో, కైవ్ మధ్య గత మూడు సంవత్సరాలకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దీనిని ముగించడం గురించి దృష్టి సారించి, అమెరికా, ఉక్రెయిన్‌కు చెందిన సీనియర్ అధికారులు మంగళవారం సౌదీ అరేబియాలోని జెడ్డాలో చర్చలు జరిపారు. ఈ చర్చలు 30 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించే సూచనలు ఇచ్చాయి. ఆ తర్వాత ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇప్పుడు మనం రష్యాకు వెళ్లామని, అధ్యక్షుడు పుతిన్ కూడా దీనికి అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ జెడ్డా ప్రకటన తర్వాత వెల్లడించారు.
అమెరికా చర్చలు
అమెరికా తమ దేశం వాదనలను అర్థం చేసుకుని, రష్యాతో చర్చలు జరుపుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం అన్నారు. ఈ నిర్మాణాత్మక చర్చల నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్‌కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. రష్యాను కూడా ఇదే విధంగా ఒప్పించడం ప్రస్తుతం అమెరికాపై ఆధారపడి ఉందన్నారు. రష్యా అంగీకరిస్తే, కాల్పుల విరమణ ఒప్పందం వెంటనే అమల్లోకి వస్తుందని జెలెన్స్కీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
Train Hijack: రైలు హైజాక్ ఆపరేషన్ సక్సెస్.. 346 మంది బందీలకు ఫ్రీడమ్..
Bank Holidays: హోలీ రోజు బ్యాంకులకు సెలవు ఉందా.. ఈ వారం 4 రోజులు బ్యాంకులు బంద్..
Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News