China Xu Feihong India: చైనా, భారత్ కలిస్తే, అమెరికా పరిస్థితి ఏంటి.. చైనా రాయబారి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 21 , 2025 | 09:13 PM
చైనా రాయబారి జు ఫీహాంగ్ అమెరికా విషయంలో చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు అమెరికాను విమర్శిస్తూనే, భారతదేశానికి చైనా అండగా ఉంటుందని ప్రకటించారు.
చైనా రాయబారి జు ఫీహాంగ్ అమెరికా మీద ఫైర్ (China Xu Feihong India) అయ్యారు. అమెరికాని బెదిరింపుదారు అని, స్వేచ్ఛా వాణిజ్యంతో లాభాలు గడించిన అమెరికా, ఇప్పుడు సుంకాలను బేరసారాల ఆయుధంగా ఉపయోగిస్తోందని ఆయన విమర్శించారు. అంతేకాదు చైనా భారతదేశంకు అండగా నిలబడుతుందని, ఈ రెండు దేశాలు ఆసియా ఆర్థిక వృద్ధికి డబుల్ ఇంజన్లని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమెరికా సుంకాల డ్రామా ఏంటి?
జు ఫీహాంగ్ చెప్పినట్లు, అమెరికా ఎప్పటి నుంచో స్వేచ్ఛా వాణిజ్యంతో బోలెడు లాభాలు గడించింది. కానీ ఇప్పుడు వివిధ దేశాల నుంచి అధిక ధరలు డిమాండ్ చేయడానికి సుంకాలను ఒక ఆయుధంగా వాడుతోంది. ఉదాహరణకు భారతదేశంపై 50% వరకు సుంకాలు విధించి, ఇంకా ఎక్కువ సుంకాలతో బెదిరిస్తోంది. ఇది చైనా సహా అనేక దేశాలకు నచ్చడం లేదు. ఇలాంటి బెదిరింపులకు మౌనంగా ఉంటే, అది బెదిరించేవారికి మరింత ధైర్యాన్ని ఇస్తుందని ఫీహాంగ్ అన్నారు.
ఎదిరించకపోతే పరిస్థితి..
అమెరికా ఈ సుంకాలతో గేమ్ ఆడుతోందని, దాన్ని ఎదిరించకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని ఆయన హెచ్చరించారు. ఇక్కడే చైనా ఒక స్టెప్ ముందుకేసి మేము భారతదేశంతో దృఢంగా నిలబడతామని ప్రకటించింది. ఇది ఇండియాకు మంచి బూస్ట్ ఇచ్చే విషయమని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రష్యా, ఫ్రాన్స్ సహా అనేక దేశాలు కూడా ఇండియాకు అండగా ఉన్నాయి.
చైనా-భారతదేశం
ఈ నేపథ్యంలో చైనా, భారతదేశం కలిస్తే ఆసియా ఆర్థిక వృద్ధికి డబుల్ ఇంజన్లలా పనిచేస్తాయి జు ఫీహాంగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆర్థిక విషయం మాత్రమే కాదని, ఇది ఒక ఐక్యతకు పిలుపు అన్నారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో అనేక మార్పులను తెస్తుందన్నారు. ఇలాంటి సమయంలో చైనా, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ఆయన సూచించారు. అమెరికా సుంకాల బెదిరింపులకు భయపడకుండా చైనా, భారతదేశం ఐక్యంగా ఉంటే, ప్రపంచ వాణిజ్యంలో కొత్త మార్పులు వస్తాయన్నారు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి