Immunity Booster Techniques: ఇమ్యూనిటీ పవర్ పెంచే సీక్రెట్ టిప్స్.. రోజుకు 5 నిమిషాలు చాలు!
ABN , Publish Date - Aug 24 , 2025 | 10:29 AM
శరీరంలో రోగనిరోధకశక్తి తక్కువైతే చాలా త్వరగా వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. సీజన్లను బట్టి వాతావరణ పరిస్థితులు మారుతుంటాయి. అందుకు తగినట్లుగా మన బాడీని సిద్ధం చేసుకుంటూ ఉండాలి. ఆహారంతో పాటు కొన్ని ప్రాణాయామ పద్ధతులు ఇమ్యూనిటీ పెంచేందుకు దోహదపడతాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా శ్వాసక్రియకు సంబంధించిన ఈ కింది వ్యాయామాలు చేస్తే ఒత్తిడి తగ్గడంతో పాటు ఇమ్యూనిటీ బలోపేతం అవుతుంది.
శ్వాసక్రియ అనేది కేవలం శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేసే వ్యవస్థ మాత్రమే కాదు. శరీరం, మనస్సు, ఆత్మను శక్తివంతం చేసే ఒక యోగం. ఆయుర్వేదం ప్రకారం, స్పృహతో శ్వాస తీసుకోవడం లేదా ప్రాణాయామం చేస్తే రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. మానసిక, శారీరక శ్రేయస్సుకు ఇది చాలా ముఖ్యమైనది. ప్రతిరోజూ క్రమబద్ధమైన శ్వాస వ్యాయామాలు చేస్తే మనస్సు తేలికపడటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి ఒక కవచంలా శరీరాన్ని వ్యాధుల నుంచి సంరక్షిస్తాయి. ఒత్తిడి, కాలుష్యం, జీవనశైలి సంబంధిత రుగ్మతలను రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ఈ ప్రపంచంలో.. రోజుకు కనీసం 5-10 నిమిషాలు ప్రాణాయామం చేస్తే లెక్కలేనన్ని ప్రయోజనాలు..

ప్రాణాయామం
ఆయుర్వేదం శ్వాసను ప్రాణ శక్తిగా నిర్వచిస్తుంది. ఈ కదలికలో అడ్డంకులు ఉంటే రోగనిరోధక శక్తిని బలహీనపడుతుంది. జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. మానసిక సమతుల్యతను ప్రభావితమవుతుంది. అందువల్ల అనులోమ్ విలోమ్ వంటి పద్ధతులు శక్తి మార్గాలను శుద్ధి చేస్తాయి. దోషాలను సమతుల్యం చేస్తాయి. రక్తంలోకి ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల శోషరస ప్రవాహాన్ని పెరిగి శరీరం విషాన్ని సమర్థవంతంగా తొలగించడానికి వీలు కలుగుతుంది. ప్రాణాయామం చేసేందుకు ముందుగాపద్మాసనంలో కూర్చోవాలి. చేత్తో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి, ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని పీల్చి కొంతసేపు అలాగే ఆపి ఉంచాలి. తర్వాత కుడి ముక్కు రంధ్రం ద్వారా వదలాలి. ఆ తర్వాత ఇదే పద్ధతిని కుడి రంధ్రంతో చేయాలి.

కపాలభాతి
మరో శక్తివంతమైన అభ్యాసం కపాలభాతి. ఇది శ్వాస క్రియలో అడ్డంకులను తొలగిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఉదర అవయవాలను టోన్ చేస్తుంది. జీర్ణక్రియను సక్రియం చేయడం, శ్లేష్మాన్ని వదులు చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కపాలభాతి చేయడం కోసం ముందుగా వెన్నెముక నిటారుగా ఉంచి సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోవాలి. ఉదర కండరాలను ఉపయోగించి బలవంతంగా గాలిని బయటకు వదలాలి. శ్వాసను సహజంగానే తీసుకోవాలి.

భ్రమరీ ప్రాణాయామం
మనశ్శాంతి, మంచి నిద్ర కోసం భ్రమరీ ప్రాణాయామం (హమ్మింగ్ బీ బ్రీతింగ్) చేయాలని యోగా నిపుణులు సూచిస్తున్నారు. బలమైన రోగనిరోధక శక్తికి ఇది చాలా అవసరం. పద్మాసనంలో కూర్చుని చేతులతో కళ్ళు మూసుకుని ముక్కు ద్వారా లోతుగా గాలి పీల్చి నెమ్మదిగా వెలుపలకు వదులుతూ ఉండాలి. తేనెటీగ శబ్దం వచ్చేలా శ్వాస వదలాలి. ప్రతిరోజూ 5 -10 నిమిషాలు చేసినా గణనీయమైన తేడాను గమనించవచ్చు.
భస్త్రికా ప్రాణాయామం
భస్త్రికా ప్రాణాయామం సాధన చేయడం వల్ల ఊపిరితిత్తుల బలం పెరుగుతుంది. ఆక్సిజన్ సరఫరా మెరుగుపడటంతో పడుతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోవాలి. కళ్ళు మూసుకుని ముక్కు ద్వారా లోతైన శ్వాస తీసుకొని శబ్దం వచ్చేలా గాలిని వేగంగా బయటకు వదలాలి. ఇలాగే 10-15 సార్లు పునరావృతం చేస్తే చాలు.

సేతు బంధాసనం
వీపు మీద పడుకుని మోకాళ్ళను తింది వంచి పాదాలను నేలకు ఆనించాలి. తర్వాత చేతులను శరీరానికి దగ్గరగా చేర్చుకుని చేతులతో పాదాలను పట్టుకుని నెమ్మదిగా తుంటి భాగాన్ని పైకి లేపండి. ఊపిరి పీల్చుకుంటూ పాదాలు, భుజాలను నేలపై గట్టిగా నొక్కండి. శరీరం వంతెన ఆకారంలోకి వచ్చాక 30 సెకన్ల పాటు అదే స్థితిలో ఉండి గట్టిగా శ్వాస తీసుకుంటూ ఉండండి. ఆ తర్వాత నెమ్మదిగా వెన్నును నేలకు ఆన్చండి. ఈ ఆసనాన్ని సరిగ్గా సాధన చేయడం వల్ల ఊపిరితిత్తులు, థైరాయిడ్ గ్రంథులు సక్రియం అవుతాయి. శరీర శక్తి పెరుగుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే, రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి
9 టు 5 జాబా?.. ఇలా చేస్తే మీ ఆరోగ్యం మీచేతుల్లో..
ప్రెగ్నెన్సీ టైంలో పారాసిటమాల్ వాడితే పుట్టబోయే బిడ్డకు ఆటిజం..!
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం