Share News

Weight Loss : ఈ బియ్యంతో చేసిన అన్నం డైలీ తిన్నా బరువు పెరగరు..

ABN , Publish Date - Mar 11 , 2025 | 07:56 PM

Weight Loss : అన్నం రోజూ తింటే బరువు పెరుగుతారని డాక్టర్లు తరచూ సూచిస్తుంటారు. అయితే, ఈ రెండు రకాల బియ్యంతో చేసిన అన్నం రోజూ తిన్నా షుగర్ లెవల్ పెరగదు. బరువు కూడా ఈజీగా తగ్గుతారని డైటీషియన్లే చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

Weight Loss : ఈ బియ్యంతో చేసిన అన్నం డైలీ తిన్నా బరువు పెరగరు..
Quinoa vs Brown Rice vs White Rice

Weight Loss With Rice : 'వెయిట్ లాస్ విత్ రైస్..' ఇదేంటి విచిత్రంగా ఉందని ఆలోచిస్తున్నారా. అన్నం తింటే బరువు పెరుగుతాం. షుగర్ ఉన్నవారికి ఇంకా డేంజర్ కదా అనుకుంటున్నారా. నిజమే, ఎందుకంటే అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టే ఈ సమస్యలు వస్తాయి. కానీ, ఈ రెండు రకాల బియ్యంతో వండిన అన్నం తింటే పై రెండూ సమస్యలు ఎప్పటికీ రావు సరికదా. సాధారణ బియ్యానికి విరుద్ధంగా ఈ రకమైన బియ్యం తింటే ఊబకాయం, డయాబెటిస్ సమస్యలు పూర్తిగా అదుపులోకి వస్తాయి.


బరువు తగ్గే విషయానికి వస్తే మనలో చాలామంది చేసే మొదటి పని ఆహారంలో అన్నం పరిమాణాన్ని తగ్గించడం. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితి మారింది. ఎక్కువ శాతం ప్రజలు బరువు తగ్గడానికి క్వినోవా బియ్యాన్ని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే క్వినోవా బియ్యంలో అనేక రకాల పోషకాలు కనిపిస్తాయి. ఇవి మీ బరువును నియంత్రించడానికి దోహదపడతాయి.అన్నం తినటం మానేయకుండానే బరువు తగ్గాలని, షుగర్ తగ్గించుకోవాలని మీరు కోరుకుంటే ఇది మీకోసమే. ఈ రకమైన బియ్యం తింటే బరువు పెరగరు. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోగలరు. అదెలాగో ఇప్పుడు మీకు తెలియజెప్తాం.


వైట్ రైస్ Vs క్వినోవా

చాలా మంది తెల్ల బియ్యం తినడానికి ఇష్టపడతారు.కానీ, ఇందులో అధిక గ్లైసెమిక్ ఉంటుంది. ఇదే శరీరంలో చక్కెర పెరిగేందుకు లేదా తగ్గేందుకు ముఖ్యకారణం. కానీ, క్వినోవాలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. తెల్ల బియ్యంతో పోలిస్తే ఒక కప్పు క్వినోవా తినడం వల్ల రెండు రెట్లు ఎక్కువ ప్రోటీన్, 5 గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మీ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలా ఇది కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను సులువుగా, త్వరగా తగ్గిస్తుంది.


బ్రౌన్ రైస్ Vs క్వినోవా

తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ మంచిదని మనందరికీ తెలుసు. కానీ క్వినోవా కంటే మెరుగైనది ఏదైనా ఉందా? బ్రౌన్ రైస్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. క్వినోవా లాగే బ్రౌన్ రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే మీరు దీన్ని తక్కువ పరిమాణంలో తిన్నప్పటికీ మీ కడుపు ఎక్కువసేపు నిండిన భావనే ఉంటుంది.


బ్రౌన్ రైస్ Vs వైట్ రైస్

తెల్లబియ్యం, బ్రౌన్ రైస్ రెండూ వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వడ్లపై ఉండే పొట్టు, ఊక పై పొరలన్నీ తొలగించి తెల్ల బియ్యం తయారు చేస్తారు. కానీ, ఈ పదార్థాలన్నీ బ్రౌన్ రైస్‌లో ఉంటాయి. బ్రౌన్ రైస్ తినడం వల్ల మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బ్రౌన్ రైస్ ఇంకా క్వినోవా తినండి. ఈ రెండు ఆహారాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.


ఏది ఎక్కువ ప్రయోజనకరం..

తెల్ల బియ్యం తినడం వల్ల ఎటువంటి హాని లేదు. కానీ క్వినోవా, బ్రౌన్ రైస్ పోషకాలపరంగా మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రెండింటిలోనూ ఫైబర్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా రెండూ గ్లూటెన్ రహితంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలోకి వస్తుంది. ఇది కాకుండా ఇవి జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతాయి.


Read Also : Calorie Chart : మీ వయసు ప్రకారం రోజుకు ఎన్ని కేలరీలు తినాలో తెలుసా.. ఈ చార్ట్ చూడండి..

Sleep At Work : పని చేసే సమయంలో నిద్రొస్తోందా.. పగటిపూట నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..

Tooth Brush Effects : బ్రష్ చేశాక టూత్ బ్రష్ బాత్రూంలోనే ఉంచితే ఇన్ఫెక్షన్.. అలా జరగకూడదంటే ఇది తెలుసుకోండి..

Updated Date - Mar 11 , 2025 | 08:09 PM