Health: కామినేని ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
ABN , Publish Date - Sep 05 , 2025 | 11:28 AM
దగ్గు వస్తోందని రాత్రి పడుకునే ముందు కరక్కాయను బుగ్గన పెట్టుకోవడం ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. ముక్కుగుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన కరక్కాయతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా అరుదైన శస్త్ర చికిత్సతో కామినేని వైద్యులు ఆమెకు ప్రాణం పోశారు.
- నిద్రలో మహిళ ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న కరక్కాయ
- బ్రాంకోస్కోపీ ద్వారా రాట్‌టూత్ పరికరంతో తొలగించిన వైద్యులు
హైదరాబాద్: దగ్గు వస్తోందని రాత్రి పడుకునే ముందు కరక్కాయను బుగ్గన పెట్టుకోవడం ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. ముక్కుగుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన కరక్కాయతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా అరుదైన శస్త్ర చికిత్సతో కామినేని వైద్యులు(Kamineni Doctor) ఆమెకు ప్రాణం పోశారు. ఆస్పత్రి పల్మనాలజీ విభాగ వైద్యులు డా.ఇ.రవీందర్, డాక్టర్ భరత్ జానపాటి వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌లోని వనస్థలిపురానికి చెందిన 57ఏళ్ల విజేత అనే మహిళకు తీవ్రంగా దగ్గు వస్తుండటంతో బుధవారం రాత్రి నిద్రించే సమయం లో దగ్గు రాకుండా కరక్కాయను చెంపపై పెట్టుకుని పడుకుంది.

నిద్రలో ఉండగా ఆ కరక్కాయ ఆమె ముక్కు గుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో తీవ్రంగా దగ్గు ఆయాసంతో ఇబ్బందిపడుతోంది. కుటుంబ స భ్యులు కామినేని ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన అక్కడి వైద్యులు కరక్కాయ ఎడమ ఊపిరితిత్తుల్లో ఉందని గుర్తించారు. వెంటనే శస్త్ర చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆ కాయను రెండు ముక్కలుగా చేసి తొలగించి విజేతకు ప్రాణం పోశారు. పునఃర్జన్మ ప్రసాదించారంటూ ఆమె కుటుంబ సభ్యులు కామినేని వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి
‘గే’ యాప్ ‘గ్రైండర్’ ద్వారా డ్రగ్స్ విక్రయం
Read Latest Telangana News and National News