Share News

Health Tips : ఈ సమస్యలు ఉన్నవారికి పాలకూర ప్రాణాంతకం..

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:16 AM

Spinach Side Effects : ఆకుపచ్చని ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుస్తాయో అందరికీ తెలుసు. ఇక వీటిలో పాలకూరని అత్యంత శ్రేష్ఠమైన వాటిలో ఒకటిగా పరిగణిస్తారు. కానీ, పాలకూరని ఈ వ్యాధులు ఉన్నవారు తింటే ఎలాంటి ప్రయోజనాలు దక్కకపోగా.. ప్రాణానికే ముప్పు ఏర్పడవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి, ఎవరెవరు పాలకూరకు దూరంగా ఉండాలో.. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips : ఈ సమస్యలు ఉన్నవారికి పాలకూర ప్రాణాంతకం..
Is Eating Too Much Spinach Bad for Your Health?

Spinach Side Effects : అత్యంత చౌక ధరలో సామాన్యుడికి కావాల్సిన సకల పోషకాలు అందించే ఆహార పదార్థాల్లో ఆకుకూరలది ప్రథమ స్థానం. ఆకుపచ్చని ఆకుకూరల వల్ల కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని. వీటిని 'పోషకాహార శక్తి కేంద్రాలు' అని పిలుస్తారు. ఇక ఆకుకూరల్లో పాలకూరకు ప్రత్యేక స్థానం ఉంది. పోషకవిలువలు ఎక్కువగా ఉండే ఆకుకూరగా ప్రసిద్ధి చెందింది. కానీ, పాలకూర కొంతమందికి మేలు చేయడానికి బదులుగా హాని చేస్తుందని ఎప్పుడైనా విన్నారా? ఇది నిజమే! వైద్యులు ఇలాంటి వారు పాలకూర తినకూడదని సలహా ఇస్తున్నారు. ఇంతకీ, పాలకూరను ఎవరెవరు తినకూడదు.. ఎందుకు తినకూడదు అనే విషయాల గురించి తెలుసుకోండి.


  • కిడ్నీ సమస్యలు : కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు పాలకూరను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే, పాలకూరలో కాల్షియం, ఆక్సలేట్‌లు అధికస్థాయిలో ఉంటాయి. ఈ పోషకాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేలా కారణమవుతాయి.

  • జీర్ణ సమస్యలు : పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే అధిక మొత్తంలో ఫైబర్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు పెరుగుతాయి. అందువల్ల, జీర్ణ సమస్యలతో బాధపడేవారు పాలకూరను ఎక్కువగా తినకుండా ఉండాలి.


  • థైరాయిడ్ సమస్య : పాలకూరలో గైట్రోజెనిక్ అంశాలు ఉంటాయి. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేస్తుంది. అదీకాక పాలకూరలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది కొన్ని మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు, థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే పాలకూర తినాలి.

  • అలెర్జీ ప్రమాదం : కొంతమందికి పాలకూర తింటే అలెర్జీ సమస్య రావచ్చు. పాలకూర తిన్న తర్వాత దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురైతే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


  • కాల్షియం లోపం : పాలకూరలో ఉండే ఆక్సాలిక్ ఆమ్లం, ఫైటేట్లు అనే మూలకాలు కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల, పాలకూరను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీకు ఇప్పటికే ఏవైనా ఎముక సమస్యలు ఉంటే మీరు పాలకూర తీసుకోవడం పరిమితం చేయాలి లేదా వైద్యుడిని సంప్రదించాలి.


ఇవి కూడా చదవండి..

Fake Medicines : మెడిసిన్స్ కొనేటప్పుడు ఈ ట్రిక్ గుర్తుంటే.. నకిలీ ఔషధాలు ఏవో తెలుసుకోవచ్చు..

Don't do this Before Workouts : వర్కవుట్లు చేసే ముందు ఈ తప్పు చేస్తే.. కొన్ని నిమిషాల్లోనే గుండెపోటు..

Health Tips : బీపీ సడన్‌గా డౌన్ అయిపోతే.. వెంటనే ఇలా చేయండి..

మరిన్ని ఆరోగ్య, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 14 , 2025 | 11:16 AM