Fake Medicines : మెడిసిన్స్ కొనేటప్పుడు ఈ ట్రిక్ గుర్తుంటే.. నకిలీ ఔషధాలు ఏవో తెలుసుకోవచ్చు..
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:03 PM
How to Find out Fake Medicines : ప్రపంచ దేశాలకు మెడిసిన్స్ సరఫరా చేసే టాప్ ఫార్మా కంపెనీలు ఉండేది మన దేశంలోనే. కానీ, మన దేశంలో చాలా చోట్ల నకిలీ ఔషధాలు అమ్ముతుంటారు. వీటి వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకున్న వారెందరో. కాబట్టి, మెడిసిన్ షాపుకు వెళ్లినపుడు నకిలీ ఔషధాలను గుర్తించేందుకు ఈ ట్రిక్ తప్పక గుర్తించుకోండి.

How to Find out Fake Medicines : భారతదేశంలో ఉండే ఫార్మసీ కంపెనీలే చాలా వరకూ ప్రపంచ దేశాలకు అవసరమయ్యే ఔషధాలను ఎగుమతి చేస్తున్నాయి. అమెరికా సహా ఎన్నో దేశాలకు మెడిసిన్స్ సరఫరా చేసే టాప్ ఫార్మా కంపెనీలు ఉండేది మన దేశంలోనే. నాణ్యమైన ఔషధాలు తయారుచేస్తారనే గొప్ప పేరు ఇండియాలోని ఫార్మా కంపెనీలకు ఉంది. కానీ, భారతదేశంలో అత్యంత నాణ్యత లేని మందులే చలామణీలో ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాలలో నకిలీ మందుల అమ్మకం ఒక ప్రధాన సమస్య. అయితే, ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకంటే మీరు ఈజీగా నకిలీ మందులేవో కనిపెట్టేయవచ్చు.
ఏ అనారోగ్య సమస్యకైనా వైద్యుడి అనుమతి లేకుండా మందులు తీసుకోవడం ఎప్పటికీ సురక్షితం కాదు. సొంతంగా మందులు కొని వాడటం వల్ల నకిలీ మందుల వాడే అవకాశం ఉంది. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల, మందుల గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
నకిలీ మందులు ఇలా గుర్తించండి..
మెడిసిన్స్ కొనుగోలు చేసిన తర్వాత బిల్లు కచ్చితంగా అడిగి తీసుకోండి. నకిలీ మందులు అమ్మేవారు బిల్లు ఇచ్చేందుకు వెనుకాడుతారు.
మందుల లేబుల్ చదవడం ద్వారా దాని నాణ్యత, ప్రామాణికత గురించి మీకు చాలా తెలుస్తుంది.
మెడికల్ స్టోర్‌లో మందులు కొనేటప్పుడు మందుల ప్యాకెట్ లేదా రేపర్‌పై ఉన్న QR కోడ్‌ని స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసి తనిఖీ చేయండి. మొత్తం సమాచారం తెలుస్తుంది. ఒకవేళ QR కోడ్ లేకపోతే అది నకిలీదని అర్థం.
కేంద్ర డేటాబేస్ నుంచి సమాచారాన్ని పొందండి: ఔషధాలపై QR కోడ్ అనేది ఒక అధునాతన వెర్షన్, దీనిని కేంద్ర డేటాబేస్ ఏజెన్సీ జారీ చేస్తుంది. ఈ కోడ్ క్రమం తప్పకుండా మారుతూ ఉంటుంది, నకిలీ QR కోడ్‌లను సృష్టించడం చాలా కష్టతరం చేస్తుంది. దీని ద్వారా మీరు ఔషధం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని పొందుతారు.
హెల్ప్‌లైన్ నంబర్: మందుల ప్యాకింగ్ పై హెల్ప్‌లైన్ నంబర్ తప్పకుండా ఇస్తారు. ఏదైనా ఔషధ ప్రామాణికత గురించి మీకు సందేహాలు ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్‌కు SMS పంపవచ్చు. దీని తరువాత కంపెనీ మీకు పూర్తి సమాచారాన్ని పంపుతుంది.
వైద్యులు సూచనతోనే మందులను వాడండి: వైద్యుడి సలహా లేకుండా ఏదైనా ఔషధాన్ని చిన్నగా లేదా పెద్ద పరిమాణంలో తీసుకోవడం మీ ఆరోగ్యానికి హానికరం. అలాగే, మందుల ప్రభావం సరిగ్గా పనిచేసేలా వాటిని సరైన సమయంలో మరియు సరైన పరిస్థితులలో తీసుకోండి.
మందుల ప్యాకేజీలు, లేబుళ్ళను జాగ్రత్తగా చదవండి: మందుల ప్యాకేజీలు మరియు లేబుళ్ళపై ఉన్న మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. మందుల తయారీదారు, గడువు తేదీ గురించి సరిచూసుకోండి.
ఇవి కూడా చదవండి..
Health Tips : బీపీ సడన్‌గా డౌన్ అయిపోతే.. వెంటనే ఇలా చేయండి..
Healthy Seeds: ఈ విత్తనాలు తీసుకుంటే మీ బలం ఒక్కసారిగా రెట్టింపు అవుతుందట..
మరిన్ని హెల్త్, తెలుగు వార్తల కొరక ఇక్కడ క్లిక్ చేయండి..