Mouth Ulcer Tips: ఈ చిట్కాలతో.. ఒక్క పూటలోనే నోటి పూత సమస్య పరార్..
ABN , Publish Date - Apr 10 , 2025 | 01:31 PM
Natural Remedies For Mouth Ulcers : నోటిపూత సమస్య ఎంత తీవ్రంగా బాధిస్తుందో అది భరించేవారికే తెలుసు. సరిగా తినలేరు. తాగలేరు. మాట్లాడలేరు. కొన్ని సార్లు నోటి దుర్వాసన ఇలా వివిధ రకాల ఇబ్బందులు. ఈ సింపుల్ హోం రెమెడీస్ పాటించారంటే ఈ బాధలన్నీ ఒక్క పూటలోనే మటుమాయమైపోతాయి.

Home Remedies For Mouth Ulcers : విటమిన్ లోపం, వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్లు ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల నోటి పూత సమస్య వస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక వేడి కారణంగా చాలామంది అజీర్ణం, మలబద్ధకం సమస్యలతో బాధపడుతుంటారు. దీని కారణంగా నోటిలో పుండ్లు వస్తాయి. జీర్ణక్రియ సరిగా లేని కారణంగా కడుపులో అసిడిటీ పెరిగి గ్యాస్, అజీర్తి సమస్యలు తలెత్తడం వల్ల కూడా నోటి అల్సర్లు సంభవిస్తాయి. అటువంటి పరిస్థితిలో నోటి పూతల నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లోనే ఈ కింది నివారణా చిట్కాలను పాటించండి.
నోటిలో పుండ్లు పెట్టే బాధ భరించలేక అందరూ వివిధ రకాల మందులు, చిట్కాలు ప్రయత్నిస్తారు. కానీ, రాత్రికి రాత్రే వేగంగా తొలగిపోవాలంటే మాత్రం ఇంట్లోనే ఈ టిప్స్ ఫాలో అవండి.
ఎండు కొబ్బరి నమలండి
ఎండిన కొబ్బరి చిప్పలలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. మీకు నోటి పూతల సమస్య ఉంటే ఎండు కొబ్బరి ముక్కలను రోజుకు మూడు నుండి నాలుగు సార్లు నమిలి నెమ్మదిగా తినండి. ఈ ఎండు కొబ్బరికాయ ముక్కల తిన్నప్పుడు నోటిలో ఉత్పత్తయ్యే నూనె నోటి పూతల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
బొబ్బల మీద ఏలకుల పొడి రాయండి
జీర్ణక్రియను మెరుగుపరచడంలో యాలకులు సహాయపడతాయి. నాలుగైదు చిన్న ఏలకులను తీసుకొని తొక్కతో పాటు మెత్తగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చెంచా లో ఏలకుల పొడికి కాసింత తేనె కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని నోటి పూతల మీద రాయండి. దీన్ని రోజుకు నాలుగైదు సార్లు అప్లై చేయడం వల్ల నోటి పూతల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
లైకోరైస్ లేదా అతిమధురం నీరు
లైకోరైస్ లేదా అతిమధురం వేర్లు నోటి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ముందుగా లైకోరైస్ వేర్లను నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం ఈ నీటితో నోటిలో వేసుకుని పుక్కిలించి పలుమార్లు ఉమ్మేయండి. నోరు శుభ్రపడిన తర్వాత నానబెట్టిన లైకోరైస్ వేరును బాగా నమలండి. ఈ నీటిని రోజుకు మూడు నుండి నాలుగు సార్లు నోట్లో వేసుకుని పుక్కిలిస్తే నోటి పుండ్లు వెంటనే తగ్గుతాయి. అలాగే వేర్లను నమలడం వల్ల కూడా నోటిలో పండ్ల సమస్య రిలీఫ్ పొందుతారు.
Read Also: Tea Effects: టీ తాగిన తర్వాత మీ కడుపు ఉబ్బిపోతుందా.. కారణం ఏమిటో తెలుసుకోండి
Kidney Stones: ఈ మొక్కతో కిడ్నీలో రాళ్లు కరిగిపోవాల్సిందే
AC Tips: AC శబ్దం చికాకు పెడుతోందా.. కారణాలు, పరిష్కారాలు ఇవిగో..