Kidney Stones: ఈ మొక్కతో కిడ్నీలో రాళ్లు కరిగిపోవాల్సిందే
ABN , Publish Date - Apr 10 , 2025 | 09:58 AM
Kidney Stones: ఓ మొక్క కిడ్నీలో రాళ్లను కూడా కరిగించేస్తుంది. ప్రతీరోజు ఈ మొక్కతో తయారుచేసిన ఔషధాన్ని తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఈజీగా కరిగిపోవడం ఖాయం.
ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. 30 ఏళ్లకే కిడ్నీలో రాళ్లు, ఇతరత్రా వ్యాధులతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కిడ్నీలో పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. జంక్ ఫుడ్స్, విచ్చలవిడిగా మెడిసిన్స్ వినియోగించడం కూడా కిడ్నీ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. అయితే, ప్రస్తుత కాలంలో చాలా మంది కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉంటే.. ఉదర భాగంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. మూత్రం రాకపోవడం, ఇతరత్రా ఇబ్బందులు కలుగుతాయి. కిడ్నీ స్టోన్స్‌పై అవగాహన కలిగి.. ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యా దరిచేరదు. చిన్న చిన్న స్టోన్స్ అయితే వాటర్ బాగా తాగితే సరిపోతుంది. కానీ, స్టోన్ సైజ్ పెద్దగా ఉన్నట్లయితే ఆపరేషన్ వరకు పరిస్థితి వెళుతుంది. అందుకే.. ముందే అలర్ట్ అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే బాగా నీళ్లు తాగాలి. ఇక ఆయుర్వేదంలోనూ కిడ్నీ స్టోన్ సమస్యకు అద్భుతమైన రెమిడీస్ ఉన్నాయి. ప్రకృతిలో లభించే చెట్ల ద్వారానే కిడ్నీ స్టోన్స్‌ని కరిగించొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క ఎంత పెద్ద స్టోన్‌ను అయినా ఇట్టే కరిగించేస్తుందంటున్నారు. మరి కిడ్నీ స్టోన్స్ కరిగించే ఆ మొక్క ఏంటో తెలుసుకుందాం..
ఉత్తరేణి మొక్క.. చాలా విరివిగా కనిపిస్తుంటుంది. ఈ మొక్క కిడ్నీ రాళ్లను కరిగించడంలో దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కిడ్నీలో రాళ్లతో బాధపడేవారికి ఆయుర్వేద నిపుణులు ఉత్తరేణి మొక్కతో తయారు చేసిన ఔషధాన్ని రిఫర్ చేస్తుంటారు. ఈ మొక్క మన పరిసరాల్లోనూ లభిస్తుంది.

ఎలా వినియోగించాలి..
ఉత్తరేణి మొక్క ఔషధాన్ని ప్రతి రోజూ 5 నుంచి 10 గ్రాముల వరకు తీసుకోవాలి. ఈ ఔషధం తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉన్న 20 నుంచి 25 మి.మీ సైజ్ ఉన్న రాళ్లు సైతం కరిగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉత్తరేణి వేర్లను ఎండబెట్టి.. ఆ వేర్లను రుబ్బి నీటిలో కలపాలి. ఆ మిశ్రమాన్ని కొంతమొత్తంలో తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. చల్లని నీటితో కలిపి తాగితే.. కిడ్నీ స్టోన్స్ సహా శరీరంలో ఎక్కడ రాళ్లు ఉన్నా కరిగిపోతాయి. గోరువెచ్చని నీటితో తీసుకుంటే.. ప్రధానంగా కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. ఈ ఔషధంతో చిన్న చిన్న రాళ్లు త్వరగా కరిగిపోతాయి. 20 నుంచి 25 మి.మీ వరకు ఉన్న రాళ్లు కరిగిపోవాలంటే మాత్రం ఈ ఔషధాన్ని ఎక్కువ కాలం తీసుకోవాల్సి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు ఆయుర్వేద నిపుణులు అందించిన సమాచారం, అంతర్జాలంలో లభించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. మీరు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. ముందుగా వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనల మేరకు అవసరమగు చికిత్స తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి
Yanamala Ramakrishnudu: ఆగస్టు సంక్షోభం లో స్పీకర్‌గా చేయాల్సిందే చేశా
Today Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధర..
Read Latest Health News And Telugu News