Share News

Diabetes: మధుమేహంతో జర జాగ్రత్త.. నాలుగో స్థానంలో తెలంగాణ

ABN , Publish Date - Nov 14 , 2025 | 01:48 PM

అన్ని వయస్సుల వారిలోనూ మధుమేహం వ్యాధి సోకుతున్నదని, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించాలని కామినేని ఆస్పత్రి ఎండోక్రినాలజిస్ట్‌ డాక్టర్‌ బి.శ్రావ్య, డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ భవాని సూచించారు.

Diabetes: మధుమేహంతో జర జాగ్రత్త.. నాలుగో స్థానంలో తెలంగాణ

- చిన్న వయస్సులోనే ప్రభావం చూపుతోంది

హైదరాబాద్‌ సిటీ: అన్ని వయస్సుల వారిలోనూ మధుమేహం(Diabetes) వ్యాధి సోకుతున్నదని, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించాలని కామినేని ఆస్పత్రి ఎండోక్రినాలజిస్ట్‌ డాక్టర్‌ బి.శ్రావ్య, డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ భవాని సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కొన్ని దశాబ్దాల క్రితం మధుమేహం 40-50 ఏళ్ల పైబడిన వారిలో కనిపించేదని, అయితే ఇప్పుడు 15-20 ఏళ్ల వయస్సు ఉన్న వారిలో కూడా మధుమేహ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రతీ రోజు తమ అవుట్‌పేషెంట్‌ విభాగానికి 20-30 మంది మధుమేహ రోగులు వస్తున్నారని, వారిలో 10-15 ఏళ్ల వాళ్లూ ఉంటున్నారన్నారు. స్థూలకాయంతో బాధపడుతున్నవారూ ఉన్నారని తెలిపారు. గర్బిణులు కూడా జెస్టేషనల్‌ డయాబెటీస్‌ కోసం తరచుగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మధుమేహ రోగులు తమ బరువును నియంత్రించుకోవడం చాలా అవసరమన్నారు. ప్రతిరోజూ నడక వంటి వ్యాయామం చేయడం, వైద్యులు సూచించిన మందులను తీసుకోవడం తప్పనిసరి అన్నారు.


city9.2.jpg

మధుమేహంలో తెలంగాణ నాలుగో స్థానం

మధుమేహం ప్రబలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ(Telangana) నాలుగో స్థానంలో ఉందని జయంతి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ కె.శరత్‌చంద్ర తెలిపారు. ఎస్‌ఆర్‌నగర్‌లోని జయంతి ఆస్పత్రిలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న మధుమేహం రక్తనాళాలను దెబ్బ తీస్తుందని, ఫలితంగా గ్యాంగ్రీన్‌, స్ట్రోక్‌, అవయవ వైఫల్యం వంటి సమస్యలు వస్తాయన్నారు.


నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎట్టా మాట్లాడుతూ అవుట్‌పేషెంట్‌ విభాగం కిడ్నీ రోగులలో మధుమేహంతో బాధపడుతున్నవారే ఉన్నారన్నారు. న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ ప్యానమ్‌ ప్రణుతి మాట్లాడుతూ స్ట్రోక్‌కు గురవుతున్న వారిలో సుమారు 65 శాతం మంది మధుమేహ రోగులు ఉన్నారన్నారు. జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ సుందర్‌సింగ్‌ మాట్లాడుతూ మనం రోజూ తీసుకునే ఆహారంలో సుమారు 60నుంచి 70శాతం వరకు ఉన్న కార్బొహైడ్రేట్లను 40 శాతానికి తగ్గిస్తే, మధుమేహం కేసులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భరత్‌రామ్‌ నుంచి ప్రాణహాని ఉంది

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2025 | 01:48 PM