Share News

Ginger Benefits: అల్లం ఇలా వాడితే కీళ్లనొప్పులు పరార్..

ABN , Publish Date - May 24 , 2025 | 09:08 AM

Health Benefits Of Ginger: అల్లంలో ఔషధ గుణాలు ఎక్కువ. దీన్ని కూరలు, మసాలాలతో పాటుగా టీ తయారీకి కూడా ఉపయోగిస్తారు. కానీ, రూట్ వెజిటేబుల్ సరిగ్గా వినియోగిస్తే కీళ్ల నొప్పులు సహా అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు.

Ginger Benefits: అల్లం ఇలా వాడితే కీళ్లనొప్పులు పరార్..
Ginger Benefits

How to Use Ginger For Health: భారతీయ వంటకాల్లోనే కాదు. ఆయుర్వేదంలోనూ అల్లానికి ప్రత్యేక స్థానముంది. టీ, పచ్చళ్లు, మసాలాలు, కూరలు, ఫాస్ట్ ఫుడ్ ఇలా అల్లంతో అనేక పదార్థాలు తయారుచేయవచ్చు. ఇది ఆహార పదార్థాల రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఔషధగుణాలు సమృద్ధిగా ఉండే అల్లం జలుబు, దగ్గుతూ పాటు అనేక తీవ్రమైన వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఇనుము, కాల్షియం, అయోడిన్, క్లోరిన్, విటమిన్లు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. అయితే, అల్లం ఎప్పుడు, ఎలా తినాలో తెలుసుకుందాం.


అసిడిటీ: ఆహారం తిన్న తర్వాత కొందరు తరచూ ఆమ్లతత్వం లేదా అసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. గుండెల్లో మంట రేగి తీవ్ర ఇబ్బంది పడతారు. అలాంటి సమయంలో ఆహారం తిన్న 10 నిమిషాల తర్వాత ఒక కప్పు అల్లం రసం తాగండి. శరీరంలోని ఆమ్ల పరిమాణం నియంత్రణలోకి వస్తుంది.


వికారం, వాంతులు: అల్లం వికారం, వాంతులు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది వికారం, మార్నింగ్ సిక్నెస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.


జీర్ణక్రియ: అల్లంలో జింజెరాల్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గ్యాస్, ఆమ్లతత్వం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.


రోగనిరోధక శక్తి: అల్లంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు అల్లం తగిన మోతాదులో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంత ఈజీగా ఇన్ఫెక్షన్ల బారిన పడరు.


కీళ్ల నొప్పులు: అల్లం కీళ్ల నొప్పులను తగ్గించేందుకు సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. దీనిని తినడం లేదా కీళ్లకు పూయడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి.


ఋతుక్రమ నొప్పికి: ఋతుక్రమ నొప్పిని తగ్గించడంలో కూడా అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిలోని శోథ నిరోధక లక్షణాలు ఋతుక్రమ నొప్పిని తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి.


అల్లం ఎలా తీసుకోవాలి?

సాధారణంగా అల్లంతో టీ తయారు చేసుకుని తాగుతుంటారు. కానీ, అల్లం వల్ల మరిన్ని ప్రయోజనాలు కావాలంటే టీకి బదులుగా దాని నీటిని తాగండి. అల్లం నీరు తయారు చేయడానికి ముందుగా దానిని తురుముకోవాలి. తర్వాత తురిమిన అల్లాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిని ఫిల్టర్ చేసి టీ లాగా తాగండి. రుచి కోసం మీరు ఈ నీటికి ఒకటి లేదా రెండు స్పూన్ల తేనె జోడించవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

పొడవు జుట్టు కావాలా.. చర్మం మెరిసిపోవాలా.. అయితే ఈ విటమిన్ రోజూ తప్పక తీసుకోండి..

Alcohol: డైలీ 1 లేదా 2 పెగ్గులు తాగడం మంచిదేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..

Read Latest Health News And Telugu News

Updated Date - May 24 , 2025 | 12:00 PM