Bihar Elections: ఎన్నికల్లో మునిగిపోయేందుకు ప్రాక్టీసు.. రాహుల్పై మోదీ సెటైర్
ABN , Publish Date - Nov 08 , 2025 | 06:37 PM
సీతామర్హిలో శనివారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, ఒకానొక సమయంలో బిహార్ ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చేపలను సేకరించేదని, కానీ మత్స్యశాఖకు సంబంధించి తాము తీసుకున్న చర్యల కారణంగా బిహార్ ఇప్పుడు చేపల పెంపకంలో స్యయం సమృద్ధిని సాధించిందని చెప్పారు.
పాట్నా: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల బిహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు బెగుసరాయి జిల్లాలో మత్స్యకారులతో కలిసి చెరువులోకి దిగడం, చేపలు పట్టడంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహార్లో చేపలు పట్టడానికి ఇప్పుడు పెద్దపెద్ద వాళ్లు వస్తున్నారని, కొందరు ఎన్నికల్లో మునిగిపోయేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారని ఛలోక్తులు విసిరారు.
బిహార్లోని సీతామర్హిలో శనివారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, ఒకానొక సమయంలో బిహార్ ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చేపలను సేకరించేదని, కానీ మత్స్యశాఖకు సంబంధించి తాము తీసుకున్న చర్యల కారణంగా బిహార్ ఇప్పుడు చేపల పెంపకంలో స్యయం సమృద్ధిని సాధించిందని చెప్పారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి చేస్తోందని అన్నారు. ఇక్కడి చేపలను చూసేందుకు పెద్దపెద్ద వాళ్లు కూడా వస్తున్నారని, కొందరు చెరువుల్లో డైవింగ్ చేస్తుంటే, మరికొందరు బిహార్ ఎన్నికల్లో మునిగిపోయేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారంటూ పరోక్షంగా రాహుల్పై సెటైర్ వేశారు.
రాహుల్ గాంధీ గతవారం బెగుసరాయ్ జిల్లాలో మత్స్యకారులను కలుసుకున్నారు. వారితో పాటు చెరువులోకి దిగి చేపలు పట్టారు. మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విపక్ష కూటమి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ముకేశ్ సాహ్నీ కూడా రాహుల్ వెంట మత్స్యకారులను కలుసుకున్న వారిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
వారణాసిలో మోదీ పర్యటన.. నాలుగు వందేభారత్ రైళ్లు ప్రారంభం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి