PM Internship 2025: PM ఇంటర్న్‌షిప్‌కు చివరి తేదీ దగ్గరపడుతోంది.. త్వరగా అప్లై చేసుకోండి.. ప్రతి నెలా 5000 రూపాయలు..
ABN , Publish Date - Apr 11 , 2025 | 07:53 PM
PM Internship 2025 Last Chance to Apply: PM ఇంటర్న్‌షిప్ పథకం 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అతి త్వరలో ముగియనుంది. దరఖాస్తుకు చివరి తేదీ 15 ఏప్రిల్ 2025గా నిర్ణయించారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నెలా రూ.5000లతో పాటు ఉపాధి కూడా పొందే అవకాశం లభిస్తుంది.

PM Internship 2025 Apply Online: ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2025 రెండవ దశ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది. మీరు ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.in ని సందర్శించండి. వెంటనే వెళ్లి దరఖాస్తు చేసుకోండి. ఈ సువర్ణావకాశం చేజారిపోకుండా చూసుకోండి. ఈ స్టేజ్ లో మొత్తం లక్ష మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాబట్టి అవకాశం మిస్ కాకండి. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 15, 2025. అంతేకాకుండా దరఖాస్తు విద్యార్థులందరికీ ఉచితం.
అధికారిక వెబ్‌సైట్‌లోని నోటీసు ప్రకారం ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు. ప్రొఫైల్‌ల్ క్రియేట్ చేసుకుని వివిధ రంగాలలోని అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లేదా దరఖాస్తు రుసుము వసూలు చేయరు.
ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి కేటాయింపులను పెంచింది. సవరించిన అంచనాల ప్రకారం రూ.380 కోట్ల నుండి రూ.10,831.07 కోట్లకు పెంచింది. ఈ పథకం మొదటి దశలో ప్రభుత్వం 1,27,000 కంటే ఎక్కువ ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించింది. రెండవ దశలో ఈ సంఖ్య దాదాపు 1,15,000. డిసెంబర్ 2024 నుండి ఇప్పటివరకు ఎంపికైన 28,000 మంది అభ్యర్థులలో కేవలం 8,700 మంది మాత్రమే ఈ పథకం కింద ఇంటర్న్‌షిప్ ప్రారంభించారు.
అర్హత :
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే OBC,SC,STఅభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. కానీ, బీ.టెక్, ఎంబీఏ, సిఏ, IITలు, IIMలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెషనల్ డిగ్రీలు కలిగిన అభ్యర్థులు ఈ పథకానికి అర్హులు కారు.
వివిధ వర్గాల అభ్యర్థులు విద్యార్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐతో పాటు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. డిప్లొమా హోల్డర్లకు, 12వ తరగతితో పాటు AICTE గుర్తింపు పొందిన డిప్లొమా తప్పనిసరి. అదే సమయంలో, గ్రాడ్యుయేట్ స్థాయిలో దరఖాస్తు చేసుకునే వారు UGC లేదా AICTE ద్వారా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.
స్టైపెండ్:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5000 స్టైఫండ్ లభిస్తుంది. అందులో రూ.4500 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రూ.500 సంబంధిత కంపెనీ CSR నిధి నుండి వస్తుంది. దీనితో పాటు ఎంపికైన అభ్యర్థులందరికీ అదనంగా రూ. 6000 ఒకేసారి ఇస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
ముందుగా అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.in ని సందర్శించండి.
హోమ్‌పేజీలో 'రిజిస్ట్రేషన్ లింక్' పై క్లిక్ చేయండి.
మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా తనిఖీ చేసి సమర్పించండి.
భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసి పెట్టుకోండి.
Read Also: RRB ALP Recruitment 2025: నిరుద్యోగులకు రైల్వే గుడ్ న్యూస్..9,970 పోస్టులకు నోటిఫికేషన్..
NTPC Recruitment 2025: ఎన్టీపీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్..ఈ అభ్యర్థులకు మంచి ఛాన్స్
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో