Share News

JNTU: నవంబరు 21, 22 తేదీల్లో జేఎన్‌టీయూ వజ్రోత్సవాలు

ABN , Publish Date - Oct 24 , 2025 | 11:22 AM

జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పడి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా నవంబరు 21, 22 తేదీల్లో వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ టి.కిషన్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. క్యాంపస్‏లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల డైమండ్‌ జూబ్లీ లోగోను ఆవిష్కరించారు.

JNTU: నవంబరు 21, 22 తేదీల్లో జేఎన్‌టీయూ వజ్రోత్సవాలు

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పడి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా నవంబరు 21, 22 తేదీల్లో వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ టి.కిషన్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. క్యాంపస్‏లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల డైమండ్‌ జూబ్లీ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డైమండ్‌ జూబ్లీ వేడుకలు 21న మొదలవుతాయని,


22న జరిగే గ్లోబల్‌ అలుమ్ని మీట్‌తో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. వేడుకులకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) హాజరవుతారని వైస్‌చాన్స్‌లర్‌ ప్రకటించారు. వజ్రోత్సవ వేడుకలను ఈ సారి ‘స్టూడెంట్‌ ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ స్టార్టప్స్‌’ థీమ్‌తో నిర్వహిస్తామని, రెండు రోజులపాటు జరిగే వజ్రోత్సవ వేడుకల్లో సాంకేతిక సెషన్లతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, ప్యానెల్‌ చర్చలు, నెట్‌వర్కింగ్‌ ఈవెంట్‌లు ఉంటాయని వెల్లడించారు.


city9.2.jfif

పూర్వ విద్యార్థులకు ‘యంగ్‌ అచీవర్స్‌’ అవార్డులు

వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పూర్వ విద్యార్థుల్లో 20 మంది ప్రముఖులకు విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డులను ప్రదానం చేస్తామని వీసీ తెలిపారు. విశ్వవిద్యాలయానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన, వృత్తిపరమైన విజయాలు సాధించిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. సాంకేతిక ఆవిష్కరణ, వ్యవస్థాపక నైపుణ్యం, విద్యావేత్తలు, పరిశోధన, సామాజిక సేవ, కార్పొరేట్‌ లీడర్‌షిప్‌, కళలు, క్రీడలు,


వినోదం వంటి విభిన్న రంగాల నుంచి 20 మంది యువకులను ఎంపిక చేసి వారిని యంగ్‌ అచీవర్స్‌ అవార్డులతో సత్కరిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో వర్సిటీ రెక్టార్‌ విజయకుమార్‌ రెడ్డి, రిజిస్ర్టార్‌ వెంకటేశ్వరరావు, అలుమ్ని డైరెక్టర్‌ భ్రమర, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నరసింహారెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం యూఎ్‌సఏ చాప్టర్‌ అధ్యక్షుడు హరి ఇప్పన్నపల్లి, జేఎన్‌టీయూ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు విజయ మోహన్‌రావు, వివిధ విభాగాల డైరెక్టర్లు పాల్గొన్నారు


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం

విమానాల్లో పవర్‌ బ్యాంకులపై నిషేధం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2025 | 11:26 AM