Share News

JNTU: 97.. ప్రజెంట్‌ సార్‌.. జేఎన్‌టీయూ కాలేజీలో కిటకిటలాడుతున్న తరగతి గదులు

ABN , Publish Date - Sep 06 , 2025 | 08:11 AM

ప్రతిష్టాత్మక జేఎన్‌టీయూ కాలేజీలో తరగతి గదులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది విపరీతంగా పెరిగిన బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఆచార్యులను (కాంట్రాక్ట్‌ లేదా గెస్ట్‌) నియమించుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. సాధారణంగా 66 నుంచి 72 మంది మాత్రమే ఉండాల్సిన తరగతి గదుల్లో, 80 నుంచి 97 మంది దాకా విద్యార్థులను చొప్పించారు. మొత్తం 13 (ఏ నుంచి ఎం వరకు) సెక్షన్లు ఉండగా, కొన్ని సెక్షన్లకు తరగతులు చాలకపోవడంతో వాటిని సెమినార్‌ హాల్స్‌లోకి మార్చారు.

JNTU: 97.. ప్రజెంట్‌ సార్‌.. జేఎన్‌టీయూ కాలేజీలో కిటకిటలాడుతున్న తరగతి గదులు

- అసాధారణ సంఖ్యలో విద్యార్థులు.. అర్థం కాని చదువులు

- ప్రొజెక్టర్లు, సౌండ్‌ బాక్సులు కరువు

హైదరాబాద్‌ సిటీ: ప్రతిష్టాత్మక జేఎన్‌టీయూ కాలేజీలో తరగతి గదులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది విపరీతంగా పెరిగిన బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఆచార్యులను (కాంట్రాక్ట్‌ లేదా గెస్ట్‌) నియమించుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. సాధారణంగా 66 నుంచి 72 మంది మాత్రమే ఉండాల్సిన తరగతి గదుల్లో, 80 నుంచి 97 మంది దాకా విద్యార్థులను చొప్పించారు. మొత్తం 13 (ఏ నుంచి ఎం వరకు) సెక్షన్లు ఉండగా, కొన్ని సెక్షన్లకు తరగతులు చాలకపోవడంతో వాటిని సెమినార్‌ హాల్స్‌లోకి మార్చారు.


సెమినార్‌ హాల్స్‌లో ఉడ్‌వర్క్‌ పాడైపోవడంతో పాఠాలు చెబుతున్న ఆచార్యుల మాటలకు రీసౌండ్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. ఆచార్యులు గట్టిగా అరచి చెబుతున్నా వారి మాటలు చివరి బెంచీల్లో కూర్చున్న విద్యార్థులకు వినిపించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయా హాల్స్‌లో ప్రొజెక్టర్లు వేసి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పాఠాలు చెప్పేందుకు వీలున్నా, ప్రొజెక్టర్లను కానీ, సౌండ్‌ బాక్సులను కొనుగోలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.


city4.2.jpg

రెగ్యులర్‌ ఫ్యాకల్టీతో బోధనే మేలు: ప్రిన్సిపాల్‌

ఫస్టియర్‌ విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనలో ఇబ్బందులు విషయమై కళాశాల ప్రిన్సిపాల్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ‘గెస్ట్‌ ఫ్యాకల్టీతో బోధన కంటే రెగ్యులర్‌ ప్రొఫెసర్స్‌తో బోధన ఉత్తమమని భావించాం. ఆ మేరకు ఆచార్యులకు వర్క్‌లోడ్‌ను పెంచాం. ఈ విషయమై వైస్‌చాన్స్‌లర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సెమినార్‌హాల్స్‌లో సౌండ్‌ బాక్స్‌ల అవశ్యకత ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. త్వరితగతిన ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతాం’ అని అన్నారు.


10 మంది ఫ్యాకల్టీని నియమించుకోలేరా

గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా విదేశీ ఎంఓయూ కోర్సుల కారణంగా రెండు సెక్షన్లకు విద్యార్థులు పెరిగారు. ప్రత్యేకించి స్వీడన్‌, జర్మనీ ఎంఓయూ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సరిపడా ఫ్యాకల్టీని నియమించలేదు. ఇప్పటివరకు ఉన్న రెగ్యులర్‌ సెక్షన్లలోనూ ఎంఓయూ కోర్సుల్లో చేరిన విద్యార్థులను కలిపేయడంతో ఒక్కో సెక్షన్‌లో 80 నుంచి 97 మంది విద్యార్థులకు ఆచార్యులు బోధన చేయాల్సి వస్తోంది. కాంట్రాక్టు ఫ్యాకల్టీ వారానికి 20 తరగతులు తీసుకుంటుండగా, రెగ్యులర్‌ ఫ్యాకల్టీకి కేవలం 14 క్లాసులను మాత్రమే కేటాయించారు.


అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టుల్లో ఉండే ఆచార్యులకైతే వారానికి 3 నుంచి 4గంటల బోధన మాత్రమే ఉండడంతో కాంట్రాక్టు ఫ్యాకల్టీపై పనిఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. రెగ్యులర్‌ సెక్షన్‌లలో విద్యార్థుల సంఖ్యకు అదనంగా 30నుంచి 50శాతం విద్యార్థులను కేటాయించడంతో అందరికీ వినపడేలా బోధించడం అటు ఆచార్యులకు, పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం విద్యార్థులకు సవాలుగా మారింది. దీంతో ఎంతో ఆశగా జేఎన్‌టీయూలో చేరిన విద్యార్థులు తీవ్ర నిరాశ, నిస్పృహకు గురవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రేపు సంపూర్ణ చంద్రగ్రహణం

పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత

Read Latest Telangana News and National News

Updated Date - Sep 06 , 2025 | 08:11 AM