ECIL Jobs 2025: మీరు ITI పాసయ్యారా? గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తుంటే ఇదే మంచి ఛాన్స్..!
ABN , Publish Date - Jun 28 , 2025 | 10:53 AM
ECIL Recruitment 2025: మీరు ITI పాస్ అయి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఇదే సువర్ణావకాశం. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) సీనియర్ ఆర్టిసాన్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు జూలై 7 లోపు www.ecil.co.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ.23,368 నుండి ప్రారంభమవుతుంది. ఐటీఐ, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ECIL Senior Artisan Recruitment 2025: ITI పాసయ్యారా? ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే మీ కల అయితే ఇదే మంచి ఛాన్స్. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) సీనియర్ ఆర్టిసాన్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగ యువకులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 26 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. చివరి తేదీ జూలై 07, 2025. కాబట్టి, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ECIL అధికారిక వెబ్‌సైట్ www.ecil.co.in లో ఆన్‌లైన్ ద్వారా గడువులోగా అప్లై చేసుకోండి.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 125 సీనియర్ ఆర్టిసాన్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సీనియర్ ఆర్టిసాన్-సి (క్యాట్-1) కోసం మొత్తం 120 పోస్టులు, సీనియర్ ఆర్టిసాన్-సి (క్యాట్-2) కోసం మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ECIL అధికారిక వెబ్‌సైట్ ecil.co.in ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 26 నుండి ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య..
సీనియర్ ఆర్టిసాన్-సి (క్యాట్-1): మొత్తం 120 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 50 పోస్టులు
ఎలక్ట్రీషియన్ - 30 పోస్టులు
ఫిట్టర్ – 40 పోస్టులు
సీనియర్ ఆర్టిసాన్-సి (క్యాట్-2): మొత్తం 5 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 1 పోస్టు
ఎలక్ట్రీషియన్ - 2 పోస్టులు
ఫిట్టర్ – 2 పోస్టులు
అర్హత
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీనితో పాటు సంబంధిత రంగంలో పనిచేసిన అనుభవం కూడా అవసరం.
వయోపరిమితి
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 30 సంవత్సరాలు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం ఎంత?
ఎంపికైన అభ్యర్థులకు ECIL నుంచి నెలకు 23,368 జీతం లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ?
ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా దరఖాస్తుదారులందరినీ 1:4 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఐటీఐలో ఒకే మార్కులు కలిగి ఉంటే10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తిగల అభ్యర్థులు జూలై 7 వరకు ECIL అధికారిక వెబ్‌సైట్ www.ecil.co.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది, కాబట్టి ఎలాంటి తప్పులు జరగకుండా ఫారంను జాగ్రత్తగా పూరించి సబ్మిట్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంజనీరింగ్.. ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
ఐసీఏఐ సీఏ 2025 ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడంటే..
For Educational News And Telugu News