Share News

TGEAPCET Counseling schedule: ఇంజనీరింగ్.. ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..

ABN , Publish Date - Jun 27 , 2025 | 08:01 PM

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో 2025 ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించారు. కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..

TGEAPCET Counseling schedule: ఇంజనీరింగ్.. ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
TGEAPCET Counseling schedule

TGEAPCET Counseling schedule 2025: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ , వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGEAPCET) - 2025 కోసం అడ్మిషన్ కమిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) చైర్మన్ వి. బాలకిష్ట రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ ఎ. శ్రీదేవసేన అధ్యక్షతన జరిగిన సమావేశంలో విడుదల చేశారు. కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..


మొదటి దశ:

  • జూన్ 28 – జూలై 7: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్

  • జూలై 1 – జూలై 8: సర్టిఫికెట్లు పరిశీలన

  • జూలై 6 – జూలై 10: వెబ్ ఆప్షన్ ఎంట్రీ (కళాశాల ఎంపిక)

  • జూలై 10: ఆప్షన్లను ఫ్రీజ్ చేయడం

  • జూలై 13 (లేదా అంతకుముందు): మాక్ సీట్ల కేటాయింపు

  • జూలై 14 – 15: ఆప్షన్లలో మార్పులు చేసుకునే అవకాశం

  • జూలై 18 (లేదా అంతకుముందు): తాత్కాలిక సీటు కేటాయింపు

  • జూలై 18 – 22: ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ రిపోర్టింగ్


రెండవ దశ: మొదటి దశకు హాజరు కాని అభ్యర్థులు ఈ దశలో పాల్గొనవచ్చు..

  • జూలై 25 నుండి ప్రారంభం

  • జూలై 26: సర్టిఫికెట్లు పరిశీలన

  • జూలై 26 -27: వెబ్ ఆప్షన్ ఎంట్రీ

  • జూలై 27: ఆప్షన్లను ఫ్రీజ్ చేయడం

  • జూలై 30 : తాత్కాలిక సీట్లు కేటాయింపు

  • జూలై 30 - ఆగస్టు 1 : ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ రిపోర్టింగ్

  • జూలై 31- ఆగస్టు 2 : కాలేజీలో రిపోర్టింగ్

  • ఆగస్టు 3: కాలేజీలో జాయినింగ్ వివరాలు తెలుపడం


చివరి దశ:

  • ఆగస్టు 5 నుండి ప్రారంభం

  • ఆగస్టు 6న సర్టిఫికెట్లు పరిశీలన

  • ఆగస్టు 6- 7 : వెబ్ ఆప్షన్ ఎంట్రీ

  • ఆగస్టు 7: ఆప్షన్లను ఫ్రీజ్ చేయడం

  • ఆగస్టు 10 లోగా సీట్ల కేటాయింపు

  • ఆగస్టు 11 – 13 మధ్య కళాశాలలో రిపోర్ట్ చేయాలి

  • ఆగస్టు 18 – 19 మధ్య అదే కళాశాలలో ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం

ముఖ్య సూచనలు:

  • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ (https://tgeapcet.nic.in) ను తరచుగా పరిశీలించాలి.

  • కళాశాల రిపోర్టింగ్ సమయంలో ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC), ఫొటోకాపీలు, ఇతర సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాలి.

Updated Date - Jun 27 , 2025 | 08:12 PM