Share News

ICAI CA Final Results: ఐసీఏఐ సీఏ 2025 ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడంటే..

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:23 PM

చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ (ICAI) నిర్వహించిన CA ఫైనల్ మే 2025 పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ విషయంపై మాజీ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ధీరజ్ ఖండేల్వాల్ సోషల్ మీడియాలో స్పందించారు.

ICAI CA Final Results: ఐసీఏఐ  సీఏ 2025 ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడంటే..
CA

ICAI CA Final Results: చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ (ICAI) నిర్వహించిన CA ఫైనల్ మే 2025 పరీక్ష ఫలితాలు జూలై మొదటి వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. జూలై 3 నుంచి 4 మధ్య విడుదలయ్యే అవకాశముందని మాజీ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ధీరజ్ ఖండేల్వాల్ తెలిపారు. ప్రతి సంవత్సరం యథావిధిగా జరుగుతున్న క్యాంపస్ ప్లేస్‌మెంట్ షెడ్యూల్‌ను బట్టి అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.


జూలై 10 నుంచి 20 వరకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. అందువల్ల ఫలితాలు జూలై 10కి ముందే విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. గతంలో మే అటెప్ట్ ఫలితాలు ఎక్కువగా జూలై నెల మొదటి లేదా రెండో వారంలో విడుదలయ్యాయి. కాబట్టి, ఈసారి కూడా అదే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ICAI అధికారిక ప్రకటన కోసం విద్యార్థులు అధికార వెబ్‌సైట్‌ను చెక్ చేస్తుండటం మంచిది.


CA ఫైనల్ రిజల్ట్ 2025ని ఎలా చెక్ చేసుకోవాలి?

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా వారి CA ఫైనల్ ఫలితాలు తెలుసుకోవచ్చు. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే..

  • ICAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - icai.nic.in

  • CA ఫైనల్ ఫలితాలు మే 2025 లింక్‌పై క్లిక్ చేయండి.

  • అభ్యర్థులు లాగిన్ అవ్వడానికి రోల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి.

  • కాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.

  • స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి.

ICAI CA ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం స్కోర్ చేయాలి. ప్రతి గ్రూప్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. 2024 CA ఫైనల్ పరీక్షలో 20,446 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.


Also Read:

మీరు జర్నీ చేస్తున్న విమానం ఎప్పుడు తయారు చేశారో తెలుసుకోవాలనుందా.. అయితే.

పాన్ కార్డుకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా.. ఈ కీలక విషయం తెలుసుకోండి..

For More Lifestyle News

Updated Date - Jun 27 , 2025 | 05:50 PM