Share News

Drugas: బెంగళూరు నుంచి హైదరాబాద్‏కు ఎండీఎంఏ డ్రగ్స్‌..

ABN , Publish Date - Mar 13 , 2025 | 10:32 AM

బెంగళూరు నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ ను తీసుకొచ్చి అమ్ముతున్న యువకుడిని ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ బృందం అరెస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా అతడి వద్ద నుంచి 6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు.

Drugas: బెంగళూరు నుంచి హైదరాబాద్‏కు ఎండీఎంఏ డ్రగ్స్‌..

- ఎండీఎంఏ విక్రయిస్తున్న డీజే ఆర్టిస్ట్‌ అరెస్ట్‌

- 6 గ్రాములు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: ఎండీఎంఏ డ్రగ్‌(MDMA drugas)ను బెంగళూరు నుంచి తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న యువకుడిని ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ బృందం అరెస్ట్‌ చేసింది. కిర్లంపూడి సుజీత్‌ అనే యువకుడు బెంగళూరులో చదువుకుంటున్న సమయంలో డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. కొంత కాలం క్రితం నగరానికి వచ్చి డీజే ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. డ్రగ్స్‌ దందా ప్రారంభించాడు. బెంగళూరు(Bengaluru)లో ఎండీఎంఏ గ్రాము రూ. 2 వేలకు కొనుగోలు చేసి నగరంలో కస్టమర్లకు గ్రాము రూ. 5 వేలకు విక్రయిస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: నరకొద్దు.. తరలిద్దాం.. 4,230 చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు హెచ్‌ఎండీఏ నిర్ణయం


city6.2.jpg

హోలీ సందర్భంగా 10 గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేశాడు. నాలుగు గ్రాములు కస్టమర్లకు విక్రయించగా, మిగిలిన ఆరు గ్రాములను తనవద్ద ఉంచుకున్నాడు. ఇతడి దందాపై సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ అధికారులు కొండాపూర్‌ ఆర్టీఓ(Kondapur RTA) కార్యాలయం వద్ద డ్రగ్స్‌ విక్రయిస్తుండగా సుజీత్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి ఆరుగ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వాయిదా పడినా.. పట్టు వీడలేదు

మటన్‌ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

మంద కృష్ణ మా నాయకుడు కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 13 , 2025 | 10:34 AM