Share News

Secunderabad: నరకొద్దు.. తరలిద్దాం.. 4,230 చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు హెచ్‌ఎండీఏ నిర్ణయం

ABN , Publish Date - Mar 13 , 2025 | 09:55 AM

నగరంలో 4,230 చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు హెచ్‌ఎండీఏ నిర్ణయం తీసుకుంది. తద్వారా పర్యవరణాన్ని పెంపొందింపజేయాలని నిర్ణయించారు. సికింద్రాబాద్‌లో ఎలివేటెడ్‌ డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణంలో ఈ చెట్ల నరికివేత విషయంలో హెచ్‌ఎండీఏ కీలక నిర్ణయం తీసుకుంది.

Secunderabad: నరకొద్దు.. తరలిద్దాం.. 4,230 చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు హెచ్‌ఎండీఏ నిర్ణయం

  • 4,230 చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు హెచ్‌ఎండీఏ నిర్ణయం

  • సికింద్రాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్లతో 9,194 చెట్లపై ప్రభావం

హైదరాబాద్‌ సిటీ: రహదారులు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టినప్పుడు అడ్డుగా ఉన్న చెట్లను నరికేస్తుంటారు. పర్యావరణానికి ముప్పు అని తెలిసినా అభివృద్ధికి ఆటంకంగా ఉందని చెట్లను తొలగిస్తుంటారు. అయితే, సికింద్రాబాద్‌(Secunderabad)లో ఎలివేటెడ్‌ డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణంలో ఈ చెట్ల నరికివేత విషయంలో హెచ్‌ఎండీఏ కీలక నిర్ణయం తీసుకుంది. అవకాశం ఉన్న మేరకు వీలైనన్నీ చెట్లను వేరే ప్రాంతానికి తరలించి వాటిని బతికించాలని నిర్ణయించింది.

ఈ వార్తను కూడా చదవండి: HYDRA: నాంపల్లి 9వ చీఫ్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ర్టేట్‌ కోర్డులో హైడ్రా కేసుల విచారణ


ఈ ప్రక్రియనే ట్రాన్స్‌లొకేషన్‌(Translocation) అంటారు. సికింద్రాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ల నిర్మాణం వల్ల దాదాపు 9,194 చెట్లు ప్రభావితం అవుతున్నాయి. వీటిలో ట్రాన్స్‌లొకేషన్‌కు అనువుగా ఉన్న 4,230 చెట్లను మరో ప్రాంతానికి తరలించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఇందుకోసం రూ.7కోట్లు ఖర్చు చేయనుంది. ఈ స్థాయిలో ట్రాన్స్‌లొకేషన్‌ ప్రక్రియ చేపట్టడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఇక, అదే స్థానంలో ఉన్నా డబుల్‌ డెక్కర్‌ ప్లైఓవర్లు, రోడ్లు విస్తరణకు ఇబ్బంది లేని 2,314 చెట్లకు కొంత వరకు కొమ్మలు తొలగించనున్నారు.


ఇక, ట్రాన్స్‌లొకేషన్‌కు అనువుగా లేని మరో 2,314 చెట్లను పూర్తిగా తొలగించనున్నారు. ట్రీ ప్రొటెక్షన్‌ కమిటీ చేసిన అధ్యయనం మేరకు ఆయా చెట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. మొత్తం 9,194 చెట్లలో హైదరాబాద్‌-కరీంనగర్‌(Hyderabad-Karimnagar) మార్గంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి శామీర్‌పేట వరకు ఉన్న ప్రాంతంలోనే 8,357 చెట్లు ఉన్నాయి. హైదరాబాద్‌-నాగ్‌పూర్‌(Hyderabad-Nagpur) మార్గంలో సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ నుంచి కొంపల్లి అవతల ఉన్న డైరీ ఫామ్‌ రోడ్డు వరకు మరో 837 చెట్లు ఉన్నాయి.


కాగా, ట్రాన్స్‌లొకేషన్‌ ప్రక్రియలో భాగంగా ఎంపిక చేసిన చెట్ల కొమ్మలను తొలగించి ప్రత్యేక యంత్రాల ద్వారా చెట్టును వేర్లతో సహా భూమిని పెకలించి వాహనంలో ఎక్కించి మరో ప్రాంతానికి తరలిస్తారు. ఆ సమయంలో వేర్లకు ప్రత్యేక రసాయనాలు పూసి చెట్టు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంపిక చేసిన ప్రాంతంలో ముందుగా సిద్ధం చేసిన గొయ్యిలో ఆ చెట్టును పాతి అది బతికేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. సికింద్రాబాద్‌లో ట్రాన్స్‌లొకేషన్‌కు ఎంపిక చేసిన చెట్ల కోసం అనువైన ప్రాంతాలను కూడా ఇప్పటికే ఎంపిక చేశారు. ట్రాన్స్‌లొకేషన్‌ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. వర్షాకాలంలో ట్రాన్స్‌లొకేషన్‌ పనులు నిర్వహించాలని హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్‌ విభాగం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వాయిదా పడినా.. పట్టు వీడలేదు

మటన్‌ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

మంద కృష్ణ మా నాయకుడు కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 13 , 2025 | 09:56 AM