Share News

Hyderabad: కట్టెతో కొట్టి, గాజులతో కోసి.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - May 15 , 2025 | 09:08 AM

ఇక్కడ అనుమానం పెనుభూతమైపోయింది.. భార్యను కట్టెతో కొట్టి, గాజులతో కోసి, గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు ఓ శాడిస్టు భర్త. అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: కట్టెతో కొట్టి, గాజులతో కోసి.. విషయం ఏంటంటే..

- ఇక్కడ అనుమానం పెనుభూతమైపోయింది..

- భార్యను చంపిన భర్త

హైదరాబాద్: అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను కట్టెతో కొట్టి, గాజులతో కోసి, గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు ఓ భర్త. బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నజియా బేగం, జాకీర్‌ భార్యాభర్తలు. పన్నెండేళ్ల క్రితం వీరికి వివాహం అయింది. ముగ్గురు సంతానం. గోల్కొండ(Golconda)లో నివసిస్తున్నారు. జాకీర్‌ ఇటీవల రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య నజియా బేగం ఈవెంట్‌లో పనిచేస్తోంది.

ఈ వార్తను కూడా చదవండి: Ponguleti: మంత్రి పొంగులేటి ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..


city4.2.jpg

భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో నెలరోజుల క్రితం మధ్యవర్తి సిరాజ్‌ సహాయంతో మొదటి భార్య, పిల్లలను కొత్తపేట సమీపంలోగల గ్రీన్‌ సిటీకి మార్చాడు. బుధవారం జాకీర్‌(Zakir) అత్త రుబీనాకు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మన్నాడు. ఆమెతోపాటు కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లగా నజియాబేగం చనిపోయి ఉంది. శరీరంపై గాయాలున్నాయి. జాకీర్‌, పిల్లలు కనిపించలేదు. మృతురాలి తల్లి రుబీనా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు

కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

High Court: ‘దోస్త్‌’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Read Latest Telangana News and National News

Updated Date - May 15 , 2025 | 10:11 AM