Hyderabad: అమ్మో.. 39.7 లక్షలు కొట్టేశారుగా.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Sep 16 , 2025 | 07:30 AM
ఆన్‌లైన్‌లో అతి తక్కువ ధరకు బల్క్‌గా వస్తువులను విక్రయిస్తున్నట్లు నమ్మించి రూ.39.7 లక్షలు కొట్టేశారు. సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. మెహిదీపట్నంకు చెందిన 28 ఏళ్ల వ్యాపారికి ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వస్తువులు కొనుగోలు చేయడం అలవాటు.
- తక్కువ ధరకు వస్తువులు అంటూ 39.7 లక్షలు స్వాహా
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్‌లో అతి తక్కువ ధరకు బల్క్‌గా వస్తువులను విక్రయిస్తున్నట్లు నమ్మించి రూ.39.7 లక్షలు కొట్టేశారు. సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. మెహిదీపట్నం(Mehidipatnam)కు చెందిన 28 ఏళ్ల వ్యాపారికి ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వస్తువులు కొనుగోలు చేయడం అలవాటు. ఈ క్రమంలో గత మే13న బల్క్‌గా ఉన్న వివిధ రకాల వస్తువులు అతి తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయని, అవసరం ఉన్నవారు కొనుగోలు చేయొచ్చని టెలీగ్రామ్‌లో ప్రకటన చూశాడు.
వారికి ఫోన్ చేసి రూ.30 లక్షలకు వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నాడు. రూ.9,99,990లు అడ్వాన్స్‌గా చెల్లించాలని అప్పుడే వస్తువులు డెలివరీ చేస్తామని విక్రయదారులు నిబంధన పెట్టారు. వారు చెప్పిన విధంగానే వ్యాపారి అడ్వాన్స్ చెల్లించాడు. అయినా వస్తువులు డెలివరీ చేయలేదు.

ఇదేంటని బాధితుడు ప్రశ్నించగా మరో రూ. 3లక్షలు చెల్లిస్తేనే డెలివరీ చేస్తామని మెలికపెట్టారు. దాంతో మరో మూడు లక్షలు చెల్లించాడు. అయినా వస్తువులు డెలివరీ చేయలేదు. ఇలా రకరకాల కారణాలు చెప్పి విడతల వారీగా వ్యాపారి నుంచి రూ.39.7లక్షలు కొల్లగొట్టారు. ఇదంతా సైబర్ నేరగాళ్ల మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ వెండి మాత్రం
మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్
ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు
Read Latest Telangana News and National News