Hyderabad: ‘క్రిప్టో’ బాధితుడికి అధికారుల అండ
ABN , Publish Date - May 03 , 2025 | 11:25 AM
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుడికి సైబరాబాద్ సైబర్ క్రైం అధికారులు అండగా నిలిచారు. రూ.20.90 లక్షలు పెట్టుబడి పెట్టించి క్రిప్టో కరెన్సీ కొనేలా చేశారు. అయితే.. ఈ మొత్తాన్ని తిరిగి రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- ఖాతాలోకి క్రిప్టో కరెన్సీ వచ్చేలా చర్యలు
హైదరాబాద్ సిటీ: క్రిప్టో ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) చేతిలో మోసపోయిన బాధితుడికి సైబరాబాద్ సైబర్ క్రైం అధికారులు అండగా నిలిచారు. ట్రేడింగ్ సంస్థను సంప్రదించి అతడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు క్రిప్టో ట్రేడింగ్‌లో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని నమ్మించారు.
ఈ వార్తను కూడా చదవండి: MLA: సీఎంగారూ.. తులం బంగారం ఎక్కడా..
పలు దఫాలుగా రూ.20.90 లక్షలు పెట్టుబడి పెట్టించి క్రిప్టో కరెన్సీ కొనేలా చేశారు. ట్రేడింగ్ వాలెట్‌లోకి క్రిప్టో కరెన్సీ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు సైబర్ నేరగాళ్లు కాజేసిన మొత్తంలో కొంత ఆఫ్రికాలో ఉన్న క్రిప్టో కరెన్సీ ఎక్సైంజ్‌కు పంపినట్లు గుర్తించారు. వాలెట్‌లో ఉన్న రూ.2.68 లక్షల విలువైన యూఎస్డీటీ కాయిన్లను ప్రీజ్ చేశారు.
కోర్టు అనుమతితో బాధితుడి ట్రేడింగ్ ఖాతాకు క్రిప్టో కాయిన్లు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. నకిలీ క్రిప్టో ట్రేడింగ్ సంస్థలు నకిలీ వెబ్‌సైట్లతో మోసాలకు పాల్పడుతున్నాయని, పెట్టుబడి పెట్టేవారు ముందుగా సంస్థ గురించి తెలుసుకున్న తర్వాతే ముందుకు సాగాలని సైబర్ క్రైం అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..
Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్
Kishan Reddy: ఓల్డ్ సిటీకీ నిధులు కేటాయించాలి
పెద్దపల్లి ఎయిర్‌పోర్టు.. బసంత్‌నగర్‌లో కాదు.. అంతర్గాంలో!
Read Latest Telangana News and National News