బైక్ నడిపి ప్రమాదానికి గురై బాలుడి మృతి
ABN , Publish Date - May 13 , 2025 | 01:41 PM
మైనర్లు మోటార్ సైకిళ్లు నడపడం ద్వారా ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయో తెలిపే సంఘటన ఇది. బైక్ ప్రమాదంలో పదమూడేళ్ల బాలుడు మృతిచెందిన విషాద సంఘటన ఇది. ప్రియన్ అనే బాలుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి బెక్ పై వెళుతుండగా అది అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. దీంతో ఆ బాలుడు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
చెన్నై: స్థానిక వండలూరు -మీంజూరు బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో బైక్ నడిపిన 13 ఏళ్ల బాలుడు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పూందమల్లి సమీపం నజరేత్‌పేట ప్రాంతానికి చెందిన కలైవానన్ కుమారుడు ప్రియన్ (13) ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం తన తండ్రి ద్విచక్ర వాహనం తీసుకెళ్లిన ప్రియన్(Priyan) తన ఇద్దరు స్నేహితులతో కలసి వండలూరు-మీంజూరు బైపాస్ రోడ్డు(Vandaluru-Meanjuru Bypass Road) వెళుతుండగా, హఠాత్తుగా వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: తల్లిదండ్రులు చెల్లిపై ప్రేమ చూపిస్తున్నారని..

ఈ ఘటనలో వాహనం నుంచి పడి ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు, ప్రియన్ అప్పటికే మృతిచెందాడని, మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు
Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్
Read Latest Telangana News and National News