Share News

Budget 2025: బడ్జెట్ తర్వాత ధరలు పెరిగే, తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..

ABN , Publish Date - Feb 01 , 2025 | 05:48 PM

Cancer Drugs To Leather Goods: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పలు వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. రేట్స్ తగ్గే వస్తువులు ఎక్కువే ఉన్నాయి. ధరలు పెరిగేవి కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Budget 2025: బడ్జెట్ తర్వాత ధరలు పెరిగే, తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..
Union Budget 2025

2025-26 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌‌ ప్రకటించింది. లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. విద్య, వ్యవసాయం దగ్గర నుంచి టెక్నాలజీ రంగాల వరకు అనేక ప్రోత్సాహకాలను అందించారు. అదే సమయంలో మధ్యతరగతితో పాటు వేతన జీవులను గుడ్‌న్యూస్ అందించారు. ఈ బడ్జెట్‌లో కొత్తగా ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయి? వేటి ధరలు పెరగనున్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం..


తగ్గేవి ఇవే:

  • ప్రాణాలను కాపాడే 36 రకాల మందులను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించారు. దీంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి.

  • క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన 3 ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్రం.

  • ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్‌లో వినియోగించే ఓపెన్ సెల్స్, ఇతర పరికరాల బేసిక్ కస్టమ్ సుంకాన్ని 5 శాతానికి తగ్గించింది.

  • కోబాల్ట్ పౌడర్, లిథియం అయాన్ బ్యాటరీ తుక్కుతో పాటు జింక్ సహా మరో 12 రకాల క్రిటికల్ మినరల్స్‌ను కూడా కస్టమ్స్ ట్యాక్స్ నుంచి మినహాయించింది కేంద్ర ప్రభుత్వం.

  • నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకుల మీదా కస్టమ్స్ డ్యూటీని 10 ఏళ్ల పాటు మినహాయింపు ఇచ్చింది సర్కారు.

  • సముద్ర ఉత్పత్తుల మీద బేసిక్ కస్టమ్ డ్యూటీని 35 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది ప్రభుత్వం.

  • తోలుతో పాటు తోలు ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గనున్నాయి.

  • ఎల్ఈడీ, ఎల్‌సీడీ టీవీల రేట్లు కూడా తగ్గనున్నాయి.

  • మొబైల్ ఫోన్లు, లిథియం బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల రేట్లూ తగ్గనున్నాయి.

  • ఫ్రోజెన్ చేపలు, చేపల పేస్ట్‌కు సంబంధించిన ధరలు కూడా తగ్గుతాయి.

  • మన దేశంలో తయారయ్యే బట్టల ధరలు కూడా తగ్గనున్నాయి.

  • క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లతో పాటు మరో 12 రకాల కీలకమైన ఖనిజాల రేట్లు కూడా తగ్గుతాయి.


పెరిగేవి ఇవే:

  • ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే మీద ట్యాక్స్‌ను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచింది కేంద్రం. దీంతో టీవీల రేట్లు పెరిగే చాన్స్ ఉంది.

  • దేశీయంగా టెక్స్‌టైల్ ఉత్పత్తులను ఎంకరేజ్ చేసేందుకు అల్లికల దుస్తుల మీద కస్టమ్స్ పన్నును 10 నుంచి 20 శాతానికి పెంచారు.

  • దిగుమతి చేసుకునే కొవ్వొత్తుల ధరలు పెరగనున్నాయి.

  • దిగుమతి చేసుకునే విలాసవంతమైన పడవల ధరలు పెరగనున్నాయి.

  • పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి.

  • ఇంపోర్టెడ్ చెప్పుల ధరలు కూడా పెరుగుతాయి.

  • స్మార్ట్ మీటర్లు, సోలార్ బ్యాటరీల ధరలు కూడా పెరగనున్నాయి.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2025 | 05:56 PM