Stock Market Crash: స్టాక్ మార్కెట్ అప్‌డేట్..సెన్సెక్స్ 560 పాయింట్ల పతనం, నిఫ్టీ కూడా డౌన్
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:41 AM
దేశీయ స్టాక్ మార్కెట్లలో నిన్న లాభాలతో సంబరపడిన ఇన్వెస్టర్లు, ఈరోజు (ఆగస్టు 8, 2025) ఊహించని నష్టాల భారం మోస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మార్కెట్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో నిన్న భారీ లాభాలను చూసిన ఇన్వెస్టర్లు ఈరోజు (ఆగస్టు 8, 2025) భారీ నష్టాలను చవి చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌తో ట్రేడ్ చర్చలు జరపనని, టారిఫ్‌ల విషయంలో వివాదం పరిష్కారం అయ్యే వరకు వాణిజ్య ఒప్పందాలు ఉండవని చెప్పడంతో మార్కెట్‌లో నిరాశ (Stock Market Crash) మొదలైంది.
ట్రంప్ భారత ఎగుమతులపై 50% టారిఫ్‌లు విధించారు, ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల సమయంలో BSE సెన్సెక్స్ 560 పాయింట్లు నష్టపోయి 80,063 పాయింట్లకు చేరింది. మరోవైపు నిఫ్టీ 50 కూడా 186.6 పాయింట్లు తగ్గిపోయి 24,409.55 పరిధిలో ఉంది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.
టాప్ లాసర్స్, గెయినర్స్
ఇదే సమయంలో సెన్సెక్స్‌లో భారతి ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ వంటి స్టాక్స్ టాప్ నష్టాల కంపెనీల్లో ఉండగా, టైటాన్, NTPC, ITC, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు కాస్త పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. సెక్టార్ల విషయానికొస్తే నిఫ్టీ రియల్టీ, మెటల్ సెక్టార్లు 1% కంటే ఎక్కువగా పడిపోయాయి. ఆటో, బ్యాంక్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ వంటి సెక్టార్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. కానీ, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్, మీడియా సెక్టార్లు మాత్రం కొంచెం గ్రీన్‌లో ట్రేడ్ అవుతున్నాయి.
నష్టాల టైంలో కూడా..
ఈ నష్టాల సమయంలో కూడా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (NSDL) షేర్లు ఆగస్టు 8న దాదాపు 16 శాతం పెరగడం విశేషం. మార్కెట్‌లో లాంచ్ అయిన తర్వాత కూడా మూడో రోజూ భారీ లాభాలను నమోదు చేశాయి. ఈ షేర్లు IPO ధరతో పోలిస్తే 62 శాతం ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్‌లో మొదటి మూడు రోజుల్లో షేర్లు సుమారు 48 శాతం పెరిగాయి. దీంతో మొదటి మూడు రోజుల్లో కంపెనీ మార్కెట్ విలువ భారీగా పెరిగి రూ. 25,000 కోట్లను దాటేసింది.
ఈరోజు Q1 ఫలితాలు
ఈ రోజు చాలా కంపెనీలు తమ Q1 ఫలితాలను ప్రకటిస్తున్నాయి. వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), సీమెన్స్, టాటా మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్, అకుమ్స్ డ్రగ్స్, లెమన్ ట్రీ హోటల్స్, మణప్పురం ఫైనాన్స్ వంటివి ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్‌పై ప్రభావం చూపించనున్నాయి.
పేజ్ ఇండస్ట్రీస్ స్టాక్ 4% డౌన్
పేజ్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ రోజు 3.77% పడిపోయి, ఒక్కో షేరు రూ.44,000 వద్ద ట్రేడ్ అయింది. జూన్ 30, 2025తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 3.1% పెరిగి రూ. 1,316.6 కోట్లకు చేరింది. కానీ వాల్యూమ్ గ్రోత్ 1.9% మాత్రమే (58.6 మిలియన్ పీసెస్). బ్రోకరేజీలు ఈ స్టాక్‌పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. దీంతో ఈ కంపెనీ స్టాక్స్ కి కొందరు బై చెప్పగా, మరికొందరు హోల్డ్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? లేక మారటోరియం తీసుకోవాలా?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి